PM Modi Gets Death Threat: ప్రధాని మోదీని చంపేస్తామని బెదిరించిన వ్యక్తిపై కేసు నమోదు, నిందితుడు హైదరాబాద్‌లో కూలీగా పనిచేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు
ప్రధాని నరేంద్ర మోదీని, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను చంపుతామని బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిపై కర్ణాటకలోని యాదగిరిలోని సూర్పూర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు కర్ణాటక పోలీసులు మంగళవారం తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీని, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను చంపుతామని బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిపై కర్ణాటకలోని యాదగిరిలోని సూర్పూర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు కర్ణాటక పోలీసులు మంగళవారం తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రధాని నరేంద్ర మోదీని, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను చంపేస్తానని బెదిరిస్తూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసినందుకు మహమ్మద్ రసూల్ కద్దరే అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు యాదగిరి పోలీసులు తెలిపారు.
యాదగిరిలోని సూర్పూర్ పోలీస్ స్టేషన్‌లో భారతీయ శిక్షాస్మృతి, ఆయుధాల చట్టంలోని సెక్షన్‌లు 505(1)(బి), 25(1)(బి) కింద నిందితుడిపై కేసు నమోదు చేశారు. తన మొబైల్ ఫోన్‌లో సెల్ఫీ వీడియో తీసిన రసూల్.. ప్రధాని మోదీని, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను అనరాని పదాలతో దూషించాడని పోలీసులు తెలిపారు.కద్దరే, యాదగిరి జిల్లా రంగపేట నివాసి, హైదరాబాద్‌లో కూలీగా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి కోసం హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో సోదాలు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీని చంపేస్తామని బెదిరింపు కాల్, దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ పేరిట బెదిరింపులు, అప్రమత్తమైన ముంబై పోలీసులు
Here's ANI News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)