PM Modi, Manda Krishna Madiga Viral Video: ప్రధాని మోడీని కౌగలించుకొని ఒక్కసారిగా తీవ్ర భావోద్వేగానికి గురైన మందకృష్ణ మాదిగ
ప్రధాని మోడీ సభా వేదికపై మందకృష్ణ మాదిగను ఆలింగనం చేసుకున్నారు. ప్రధాని మోడీ కౌగలించుకోవడంతో ఒక్కసారిగా మందకృష్ణ మాదిగ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరుగుతోన్న మాదిగ ఉపకులాల విశ్వరూప మహసభలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ భావోద్వేగానికి గురయ్యారు. ఈ సభకు ప్రధాని మోడీ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ సభా వేదికపై మందకృష్ణ మాదిగను ఆలింగనం చేసుకున్నారు. ప్రధాని మోడీ కౌగలించుకోవడంతో ఒక్కసారిగా మందకృష్ణ మాదిగ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. సభావేదికపై తన పక్కనే కుర్చొని కంట తడిపెట్టుకున్న మందకృష్ణ మాదిగను మోడీ భుజం తట్టి ఓదార్చారు. ఈ దృశ్యం సభలో హైలెట్‌గా మారింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)