Pulwama Attack Anniversary 2024: పుల్వామా జిల్లాలో ఉగ్రదాడి జరిగి నేటికి ఐదేళ్లు, మీ త్యాగం ఎప్పటికీ గుర్తుండిపోతుందంటూ అమరవీరులకు ప్రధాని మోదీ నివాళి
జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఉగ్రదాడి జరిగి నేటికి ఐదేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం (ఫిబ్రవరి 14) నివాళులర్పించారు. ‘పుల్వామాలో అమరులైన వీరులకు నివాళులు అర్పిస్తున్నాను’ అని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్’లో ప్రధాని మోదీ పేర్కొన్నారు.
జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఉగ్రదాడి జరిగి నేటికి ఐదేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం (ఫిబ్రవరి 14) నివాళులర్పించారు. ‘పుల్వామాలో అమరులైన వీరులకు నివాళులు అర్పిస్తున్నాను’ అని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్’లో ప్రధాని మోదీ పేర్కొన్నారు. దేశం కోసం వారు చేసిన సేవలు, త్యాగం ఎప్పటికీ గుర్తుండిపోతాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
2019, ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవానులు అమరులయ్యారు. ఈ ఘటనలో 35 మంది గాయపడ్డారు. ఆరోజు సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌లో 78 వాహనాలు ఉండగా, వాటిలో 2500 మందికి పైగా సైనికులు ప్రయాణిస్తున్నారు. ఉగ్రవాదులు 200 కిలోల పేలుడు పదార్థాలతో కూడిన వాహనంతో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకున్నారు.
Here's PM Modi Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)