Ram Temple Consecration Ceremony: అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి దూరంగా ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ట్రస్ట్ స్పందన ఏంటంటే..

అయోధ్యలో రామమందిర నిర్మాణంలో ప్రధాన పాత్రధారులు, బీజేపీ సీనియర్ నేతలు ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి రాముని ఆలయ ప్రారంభోత్సవానికి దూరంగా ఉండనున్నారు. వీరి వయసును దృష్టిలో పెట్టుకుని ప్రారంభోత్సవానికి రావొద్దని ఆలయ ట్రస్ట్ కోరింది.

LK Advani and MM Joshi (Photo-X)

అయోధ్యలో రామమందిర నిర్మాణంలో ప్రధాన పాత్రధారులు, బీజేపీ సీనియర్ నేతలు ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి రాముని ఆలయ ప్రారంభోత్సవానికి దూరంగా ఉండనున్నారు. వీరి వయసును దృష్టిలో పెట్టుకుని ప్రారంభోత్సవానికి రావొద్దని ఆలయ ట్రస్ట్ కోరింది. ప్రస్తుతం అద్వానీ వయసు 96 సంవత్సరాలు కాగా, మురళీ మనోహర్ జోషి వయసు 89 సంవత్సరాలు.

అద్వానీ, జోషి ఇద్దరూ పెద్ద వయస్కులని, వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలయ ప్రారంభోత్సవానికి హాజరు కావొద్దని విజ్ఞప్తి చేసినట్టు ఆలయ ట్రస్ట్ తెలిపింది. తమ విజ్ఞప్తిని వారు మన్నించారని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్ తెలిపారు. ఆలయ ప్రారంభోత్సవానికి మాజీ ప్రధాని దేవెగౌడ (90)ను ఆహ్వానించేందుకు ముగ్గురు సభ్యుల బృందాన్ని ఆహ్వానించినట్టు పేర్కొన్నారు.

Here's News

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement