Ravi Sinha As New RAW Chief: రిసెర్చ్ అండ్‌ అనాలిసిస్‌ వింగ్‌ నూతన అధిపతిగా రవి సిన్హా, రెండేళ్లపాటు పదవిలో కొనసాగనున్న సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి

ఇండియా ఎక్స్‌టర్నల్‌ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన రిసెర్చ్ అండ్‌ అనాలిసిస్‌ వింగ్‌ (RAW) నూతన అధిపతిగా ఛత్తీస్‌గఢ్‌ క్యాడర్‌కు చెందిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి (Senior IPS Officer) రవి సిన్హా (Ravi Sinha ) నియమితులయ్యారు.

Ravi Sinha (Photo Credits: Twitter@capt_ivane)

ఇండియా ఎక్స్‌టర్నల్‌ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన రిసెర్చ్ అండ్‌ అనాలిసిస్‌ వింగ్‌ (RAW) నూతన అధిపతిగా ఛత్తీస్‌గఢ్‌ క్యాడర్‌కు చెందిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి (Senior IPS Officer) రవి సిన్హా (Ravi Sinha ) నియమితులయ్యారు. ప్రస్తుతం RAW చీఫ్‌గా ఉన్న సమంత్‌ గోయెల్‌ పదవీకాలం ఈ నెల 30న ముగియనుండటంతో.. ఆయన స్థానంలో కొత్త చీఫ్‌గా రవి సిన్హాను నియమించారు.

రవి సిన్హా రెండేళ్లపాటు ఆ పదవిలో కొనసాగుతారని కేంద్ర వ్యక్తిగత మంత్రిత్వ శాఖ తన ఆదేశాల్లో పేర్కొన్నది. 1988 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి అయిన రవి సిన్హా ప్రస్తుతం క్యాబినెట్‌ సెక్రెటేరియట్‌ స్పెషల్‌ సెక్రెటరీగా ఉన్నారు. ప్రస్తుతం అప్పాయింట్స్‌ కమిటీ ఆయనను RAW సెక్రెటరీగా నియమించినట్లు ప్రకటించింది.

ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now