Snakebite Treatment: పాము కాటేస్తే చేయకూడని పనులు ఇవే, మార్గదర్శకాలతో కూడిన వీడియోని విడుదల చేసిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ
భారతదేశంలో పాముకాటు మరణాలు పెరుగుతున్నాయి. పట్టణీకరణ పెరుగుతోంది, అడవులలో నివసించే ప్రజల ధోరణి పెరుగుతోంది.
పాము కాటుతో మరణాలను నివారించేందుకు సామాన్య ప్రజలకు అవగాహన కల్పించేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తోంది. భారతదేశంలో పాముకాటు మరణాలు పెరుగుతున్నాయి. పట్టణీకరణ పెరుగుతోంది, అడవులలో నివసించే ప్రజల ధోరణి పెరుగుతోంది. వరదలు, ప్రకృతి వైపరీత్యాలు కూడా పెరిగాయి. దీంతో పాములు జనావాసాలకు వస్తున్నాయి. అది ప్రమాదాన్ని పెంచుతుంది, మరణాలను పెంచుతుంది.
ఇప్పుడు పాముకాటుతో మృత్యువాత పడకుండా ఉండేందుకు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే షార్ట్ ఫిల్మ్ తీసుకొచ్చింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.కరిచిన పాము విషమా లేదా విషపూరితం కాదా అనేది మొదటగా ప్రజలు అర్థం చేసుకోవాలి. పాము కాటుకు గురికాకుండా ఎలా నివారించాలి, విషపూరిత పాము కాటుకు గురై ఆసుపత్రికి ఎందుకు వెళ్లాలి, పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి అనే విషయాలను ఈ షార్ట్ ఫిలిం లో చూపించారు.
Here's Video