Sonia Gandhi Admitted to Hospital: శ్వాసనాళాల వాపుతో ఆస్పత్రిలో చేరిన సోనియాగాంధీ, ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపిన వైద్యులు
కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత్రి సోనియాగాంధీ అస్వస్థతకు గురయ్యారు. ఆమెను ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రికి తరలించారు. ఆమె బ్రాంకైటిస్ (శ్వాసనాళాల వాపు) తో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. 76 ఏళ్ల సోనియాగాంధీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు.
కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత్రి సోనియాగాంధీ అస్వస్థతకు గురయ్యారు. ఆమెను ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రికి తరలించారు. ఆమె బ్రాంకైటిస్ (శ్వాసనాళాల వాపు) తో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. 76 ఏళ్ల సోనియాగాంధీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు. వాస్తవానికి ఆమె నిన్ననే ఆసుపత్రిలో చేరినప్పటికీ... ఈ విషయం ఆలస్యంగా బయటకు వచ్చింది. జ్వరం లక్షణాలతో ఆమె ఆసుపత్రికి వచ్చారని... చెస్ట్ మెడిసిన్ డిపార్ట్ మెంట్ సీనియర్ కన్సల్టెంట్ ఆరుప్ బసు నేతృత్వంలోని వైద్య బృందం ఆమెను పర్యవేక్షిస్తోందని ఆసుపత్రి ఛైర్మన్ డీఎస్ రాణా చెప్పారు.ఈ ఏడాది ఆమె ఆసుపత్రిలో చేరడం ఇది రెండో సారి. జనవరిలో శ్వాసకు సంబంధించిన వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా ఆమె హాస్పిటల్ లో చేరారు.
Here's ANI Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)