CM MK Stalin Covid: ఆస్పత్రిలో చేరిన త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్, కోవిడ్ ప‌రీక్ష‌లో పాజిటివ్ రావడంతో అబ్జ‌ర్వేష‌న్‌లో ఉంచామ‌ని తెలిపిన వైద్యులు

సీఎం స్టాలిన్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని గ‌వ‌ర్న‌ర్ ఆర్ఎన్ ర‌వి ఆకాంక్షించారు.

Tamil Nadu Chief Minister MK Stalin. Credits: PTI

త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్ ఇవాళ హాస్పిట‌ల్‌లో చేరారు. చెన్నైలోని అళ్వార్‌పేట్‌లో ఉన్న కావేరి ఆస్ప‌త్రిలో ఆయ‌న చేరారు. జూలై 12వ తేదీన ఆయ‌న కోవిడ్ ప‌రీక్ష‌లో పాజిటివ్ తేలిన విష‌యం తెలిసిందే. కోవిడ్ సంబంధిత ల‌క్ష‌ణాలు ఉన్న కార‌ణంగా సీఎం స్టాలిన్ హాస్పిట‌ల్‌లో చేరార‌ని, ఆయ‌న‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నామ‌ని, అబ్జ‌ర్వేష‌న్‌లో ఉంచామ‌ని హాస్పిట‌ల్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. సీఎం స్టాలిన్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని గ‌వ‌ర్న‌ర్ ఆర్ఎన్ ర‌వి ఆకాంక్షించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)