Tripura Assembly Ruckus: అసెంబ్లీలో పోర్న్ వీడియోలు చూసిన బీజేపీ ఎమ్మెల్యే, దానిపై చర్చ చేపట్టాలని ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే డిమాండ్, త్రిపుర అసెంబ్లీలో రచ్చరచ్చ
త్రిపుర అసెంబ్లీలో పోర్న్ అంశం కాక రేపింది. మార్చిలో అసెంబ్లీలో మొబైల్ ఫోన్‌లో అశ్లీల చిత్రాలు చూస్తూ పట్టుబడిన బీజేపీ శాసనసభ్యుడు జాదబ్ లాల్ నాథ్ "దుష్ప్రవర్తన"పై చర్చ జరగాలని తిప్రా మోత ఎమ్మెల్యే అనిమేష్ దెబ్బర్మ కోరారు.దీనిపై అధికార బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తంచేశారు.
త్రిపుర అసెంబ్లీలో పోర్న్ అంశం కాక రేపింది. మార్చిలో అసెంబ్లీలో మొబైల్ ఫోన్‌లో అశ్లీల చిత్రాలు చూస్తూ పట్టుబడిన బీజేపీ శాసనసభ్యుడు జాదబ్ లాల్ నాథ్ "దుష్ప్రవర్తన"పై చర్చ జరగాలని తిప్రా మోత ఎమ్మెల్యే అనిమేష్ దెబ్బర్మ కోరారు.దీనిపై అధికార బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తంచేశారు. దాంతో ప్రతిపక్ష కాంగ్రెస్, సీపీఎం సభ్యులు కూడా టిప్ర మోతా పార్టీ సభ్యులతో జత కలిసి అధికార బీజేపీ తీరుపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తోపులాట జరిగింది. ఒకరినొకరు ఇష్టం వచ్చినట్లు దూషించుకున్నారు. దీంతో సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించినందుకు ఐదుగురు ఎమ్మెల్యేలను శుక్రవారం త్రిపుర అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశామని, ఆ తర్వాత విపక్షాలు వాకౌట్ చేశాయని ఓ అధికారి తెలిపారు.
ANI Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)