Twitter Revenue: ఇకపై ట్వీట్లు చేస్తే డబ్బులే డబ్బులు, బ్లూ టిక్ యూజర్లకు రెవిన్యూలో షేర్ ఇవ్వనున్నట్లు ప్రకటించిన మస్క్, డబ్బులు ఎలా వస్తాయంటే?
బ్లూటిక్ సబ్ స్క్రైబర్లు ఇకపై చేసే ట్వీట్లకు ఎవరైనా రిప్లై (Twitter reply) ఇస్తే...దాని కింద వచ్చే యాడ్లకు రెవిన్యూ వస్తుంది. దాంట్లో నుంచి ఆ యూజర్లకు కూడా షేర్ ఇవ్వనున్నట్లు ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ (Elon musk) ప్రకటించారు.
New York, FEB 04: ట్విట్టర్ యూజర్లు ఇకపై ట్వీట్లు (Tweets) పోస్టు చేయడం ద్వారా డబ్బులు సంపాదించవచ్చు. బ్లూటిక్ సబ్ స్క్రైబర్లు ఇకపై చేసే ట్వీట్లకు ఎవరైనా రిప్లై (Twitter reply) ఇస్తే...దాని కింద వచ్చే యాడ్లకు రెవిన్యూ వస్తుంది. దాంట్లో నుంచి ఆ యూజర్లకు కూడా షేర్ ఇవ్వనున్నట్లు ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ (Elon musk) ప్రకటించారు. అంటే య్యూటూబ్ లో యాడ్స్ పోస్టు చేయడం ద్వారా ఎలాగైతే డబ్బులు వస్తాయో...ఇప్పుడు ట్విట్టర్ లో ఆసక్తికరమైన పోస్టులు చేయడం ద్వారా కూడా మనీ సంపాదించవచ్చు. అయితే 5 డాలర్లు పెట్టి బ్లూ టిక్ సబ్ స్క్రైబ్ (Blue tick) చేసుకున్నవారి సంఖ్యను పెంచుకోవడంతో పాటూ, వారిని ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)