Gangster Sanjeev Jeeva Shot Video: లక్నో కోర్టులో జడ్జి ముందే గ్యాంగ్‌స్టర్‌పై కాల్పులు, అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన బీజేపీ నేత బ్రహ్మదత్‌ ద్వివేది హత్య కేసు నిందితుడు సంజీవ్‌ జీవా

యూపీలోని లక్నో కోర్టులో గ్యాంగ్‌స్టర్‌ (Gangster) సంజీవ్‌ జీవా (Sanjeev Jeeva)ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. లక్నో కోర్టు (Lucknow court) వెలుపల బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. బీజేపీ నేత బ్రహ్మదత్‌ ద్వివేది హత్య కేసులో సంజీవ్‌ జీవా నిందితుడిగా ఉన్నాడు. విచారణ నిమిత్తం నేడు పోలీసులు సంజీవ్‌ను కోర్టులో హాజరుపరిచారు

Gangster Sanjeev Jeeva Shot Video

యూపీలోని లక్నో కోర్టులో గ్యాంగ్‌స్టర్‌ (Gangster) సంజీవ్‌ జీవా (Sanjeev Jeeva)ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. లక్నో కోర్టు (Lucknow court) వెలుపల బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. బీజేపీ నేత బ్రహ్మదత్‌ ద్వివేది హత్య కేసులో సంజీవ్‌ జీవా నిందితుడిగా ఉన్నాడు. విచారణ నిమిత్తం నేడు పోలీసులు సంజీవ్‌ను కోర్టులో హాజరుపరిచారు. విచారణ జరుగుతున్న సమయంలో లాయర్ల వేషణధారణలో వచ్చిన ప్రత్యర్థులు జడ్జి ముందే అతడిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సంజీవ్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఘటన అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. కాగా, ఈ కాల్పుల ఘటనలో ఓ యువతికి గాయాలైనట్లు సమాచారం.

ANI Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement