Kedarnath Yatra: ఉత్తరాఖండ్ వరదలు, కేదార్‌నాథ్ యాత్ర నిలిపివేత, ఉదృతంగా ప్ర‌వ‌హిస్తున్న మందాకిని, అల‌క‌నంద న‌దులు, ఆరెంజ్ అల‌ర్ట్ జారీ

ఉత్త‌రాఖండ్‌లోని కేదార్‌నాథ్ యాత్ర‌(Kedarnath Dham Yatra)ను నిలిపివేశారు. సోన్‌ప్ర‌యాగ్‌, గౌరికుండ్ వ‌ద్ద యాత్రికుల‌ను నిలిపివేసిన‌ట్లు అధికారులు ఇవాళ ప్ర‌క‌టించారు. భ‌క్తుల భ‌ద్ర‌త నేప‌థ్యంలో ఆ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వెల్ల‌డించారు. వాతావ‌ర‌ణం అనుకూలంగా లేక‌పోవ‌డంతో యాత్రికుల్ని ఆపేసిన‌ట్లు తెలిపారు.

Uttarakhand Cloudburst Video

ఉత్త‌రాఖండ్‌లోని కేదార్‌నాథ్ యాత్ర‌(Kedarnath Dham Yatra)ను నిలిపివేశారు. సోన్‌ప్ర‌యాగ్‌, గౌరికుండ్ వ‌ద్ద యాత్రికుల‌ను నిలిపివేసిన‌ట్లు అధికారులు ఇవాళ ప్ర‌క‌టించారు. భ‌క్తుల భ‌ద్ర‌త నేప‌థ్యంలో ఆ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వెల్ల‌డించారు. వాతావ‌ర‌ణం అనుకూలంగా లేక‌పోవ‌డంతో యాత్రికుల్ని ఆపేసిన‌ట్లు తెలిపారు.భారీ వ‌ర్షాల కార‌ణంగా ఐఎండీ ఇవాళ ఉత్త‌రాఖండ్ కోసం ఆరెంజ్ అల‌ర్ట్ జారీ చేసింది. మందాకిని, అల‌క‌నంద న‌దులు ఉదృతంగా ప్ర‌వ‌హిస్తున్నాయి. భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఐఎండీ ట్వీట్ చేసింది.ఇక గంగోత్రి జాతీయ ర‌హ‌దారిపై మంగ‌ళ‌వారం కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ‌డం వ‌ల్ల న‌లుగురు మృతిచెందారు. ప‌ది మంది గాయ‌ప‌డ్డారు

ANi Tweet

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement