Delhi Shocker: నడిరోడ్డు మీద యువకుడిని కత్తితో పొడిచిన 10 మంది యువకులు, విలవిల్లాడుతూ రోడ్డుపై కుప్పకూలిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు

దేశ రాజధానిలో కొందరు వ్యక్తులు ఓ యువకుడిని నడిరోడ్డుపై పొడిచి చంపేశారు. ఢిల్లీలోని నంగ్లోయ్‌ ఏరియాకు చెందిన విశాల్‌ మాలిక్‌ అనే యువకుడు ఇవాళ ఉదయం జిమ్‌కు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా దారివెంట నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తికి బైక్‌ తగిలింది.

Man Kills Son To Hide Affairrepresentational purpose only | (Photo Credits: PTI)

దేశ రాజధానిలో కొందరు వ్యక్తులు ఓ యువకుడిని నడిరోడ్డుపై పొడిచి చంపేశారు. ఢిల్లీలోని నంగ్లోయ్‌ ఏరియాకు చెందిన విశాల్‌ మాలిక్‌ అనే యువకుడు ఇవాళ ఉదయం జిమ్‌కు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా దారివెంట నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తికి బైక్‌ తగిలింది. దాంతో స్థానికంగా ఉన్న ఓ పది మంది వ్యక్తులు కలిసి విశాల్‌పై దాడి చేశారు.వారి బారి నుంచి ఎలాగోలా తప్పించుకున్న విశాల్‌ మాలిక్‌.. బైక్‌ను మాత్రం అక్కడే వదిలేశాడు. అనంతరం స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి సాయం కోరాడు. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో జరిగిన విషయం తన అన్న సాహిల్ మాలిక్‌ (25)కు చెప్పాడు.

దాంతో బైక్‌ తెచ్చేందుకు వెళ్లిన సాహిల్‌ మాలిక్‌పై కూడా వాళ్లు దాడిచేశారు. అంతటితో ఆగక కత్తితో కడుపులో పొడిచి పారిపోయారు.దాంతో సాహిల్ మాలిక్‌ అక్కడికక్కడే రోడ్డుపై కుప్పకూలాడు. ఈ ఘటనను చూసిన కొందరు అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లి రక్షించే ప్రయత్నం చేస్తుండగానే రోడ్డుపై విలవిల్లాడుతూ ప్రాణాలు విడిచాడు. కత్తిపోటుకు గురైన సాహిల్‌ రోడ్డుపై విలవిల్లాడుతూ కుప్పకూలిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కింది వీడియోలో ఆ దృశ్యాలున్నాయి.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now