Karnataka: దారుణం, పింఛన్ కోసం రెండు కిలోమీటర్ల దూరం పాక్కుంటూ వెళ్లిన బామ్మ, కర్ఱాణకలోని దావణగెరె జిల్లాలో విషాదకర ఘటన

అడిగితే పోస్టుమాన్ విసుక్కుంటున్నాడు. దీంతో రోడ్డుపై దేకుతూ 8 గంటల పాటు ప్రయాణించి 2 కిలోమీటర్ల దూరంలోని పోస్టాఫీసుకు చేరుకుందా పెద్దావిడ.

77-yr-old specially abled woman crawls 2km over unpaid pension in Karnataka

కర్ణాటకలోని దావణగెరె జిల్లాలోని హరిహర్ తాలూకాలో ప్రత్యేక వికలాంగురాలైన బామ్మకి జీవనాధారమైన పింఛను డబ్బు 2నెలలుగా రాలేదు. అడిగితే పోస్టుమాన్ విసుక్కుంటున్నాడు. దీంతో రోడ్డుపై దేకుతూ 8 గంటల పాటు ప్రయాణించి 2 కిలోమీటర్ల దూరంలోని పోస్టాఫీసుకు చేరుకుందా పెద్దావిడ. దాని వల్ల కాళ్లంతా గాయాలయ్యాయి. సంతానం లేని గిరిజమ్మ అనే వృద్ధ మహిళ (77) ఫించను మీద ఆధారపడి జీవిస్తున్నారు. వారం క్రితం జరిగిన ఈ ఘటన వీడియో వైరల్ కావడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెలా పోస్టాఫీస్ ద్వారా ఆమెకు పెన్సన్ వస్తుండగా 2023 నవంబర్ నుంచి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఆగిపోయాయని గిరిజమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.

Here's Video