Mumbai: ముంబైలో తీవ్ర విషాదం, పక్షిని కాపాడబోయి ఇద్దరు మృతి, కళ్లు మూసుకుపోయి గుద్దేసిన ట్యాక్సీ డ్రైవర్, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

పక్షిని కాపాడబోయిన ఇద్దరిని కారు ఢీకొట్టింది. ఒక వ్యక్తి అక్కడికక్కడే మరణించగా, మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. మే 30న 43 ఏళ్ల అమర్ మనీష్ జరీవాలా అనే వ్యక్తి కారులో బాంద్రా-వర్లీ సీ లింక్ మార్గంలో మలాడ్ వెళ్తున్నాడు

Mumbai Businessman, driver stop to save eagle; killed as cab ploughs into them on Bandra-Worli sea link (Photo-Video Grab)

ముంబైలో విషాదం చోటు చేసుకుంది. పక్షిని కాపాడబోయిన ఇద్దరిని కారు ఢీకొట్టింది. ఒక వ్యక్తి అక్కడికక్కడే మరణించగా, మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. మే 30న 43 ఏళ్ల అమర్ మనీష్ జరీవాలా అనే వ్యక్తి కారులో బాంద్రా-వర్లీ సీ లింక్ మార్గంలో మలాడ్ వెళ్తున్నాడు. అయితే ఆయన ప్రయాణిస్తున్న కారు కింద ఒక గ్రద్ద చిక్కుకుంది. దీంతో వెంటనే కారును ఆపమని డ్రైవర్‌ శ్యామ్‌ సుందర్‌ కుమార్‌కు ఆయన చెప్పాడు.

అనంతరం కారు దిగిన వారిద్దరూ ఆ గ్రద్దను రక్షించేందుకు ప్రయత్నించారు. మరోవైపు మరో లేన్‌లో వేగంగా వచ్చిన ఒక ట్యాక్సీ ఆ ఇద్దరినీ బలంగా ఢీకొట్టింది. దీంతో వారిద్దరూ గాల్లో ఎగిరి నేలపై పడ్డారు. ఈ ప్రమాదంలో అమర్ మనీష్ జరీవాలా అక్కడికక్కడే మరణించాడు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ శ్యామ్‌ సుందర్‌ కుమార్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఇద్దరు వ్యక్తుల ఉసురు తీసిన ట్యాక్సీ డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ప్రమాద సమయంలో అక్కడి సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)