BJP Third Candidate List: చెన్నై సౌత్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్న తమిళిసై సౌందర్ రాజన్, బీజేపీ మూడో జాబితా ఇదిగో..
తమిళనాడు రాష్ట్రానికి చెందిన 9 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను గురువారం సాయంత్రం ఆ పార్టీ అధికారికంగా విడుదల చేసింది.
BJP Third Candidate List for Lok Sabha Elections 2024 Out: రానున్న లోక్‌సభ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ మూడో జాబితా విడుదల చేసింది. తమిళనాడు రాష్ట్రానికి చెందిన 9 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను గురువారం సాయంత్రం ఆ పార్టీ అధికారికంగా విడుదల చేసింది. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ చెన్నై సౌత్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బరిలో దిగనున్నట్లు జాబితాలో పేర్కొన్నారు.
కోయంబత్తూరు నుంచి అన్నామలై, కన్యాకుమారి నుంచి రాధాకృష్ణన్, చెన్నై సెంట్రల్ నుంచి వినోజ్ పీ సెల్వం, వెల్లూరు నుంచి డాక్టర్ ఏసీ షణ్ముఘం, కృష్ణగిరి నుంచి సీ నరసింహా, నీలగిరి – డాక్టర్ ఎల్ మురుగన్, పెరంబలూరు నుంచి టీఆర్ పర్వేంధర్, తూత్తూకుడి నుంచి నైనార్ నరేంద్రన్ పోటీ చేయనున్నారు.
Here's List
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)