Bharat Jodo Yatra: విద్వేష‌, విభ‌జ‌న రాజ‌కీయాల‌తో నా తండ్రిని కోల్పోయాను, దేశాన్ని కోల్పోవడానికి సిద్ధంగా లేనని తెలిపిన రాహుల్ గాంధీ, నేటి నుంచి కాంగ్రెస్ భార‌త్ జోడో యాత్ర

యాత్ర ప్రారంభానికి ముందు శ్రీపెరంబ‌దూర్‌లో ఉన్న మాజీ ప్ర‌ధాని రాజీవ్‌గాంధీ స్మార‌కం వ‌ద్ద రాహుల్ నివాళి అర్పించారు.

Rahul Gandhi (Photo Credits: Instagram)

కాంగ్రెస్ పార్టీ నేటి నుంచి క‌న్యాకుమారి నుంచి జమ్మూ కాశ్మీర్ దాకా మెగా ర్యాలీ భార‌త్ జోడో యాత్ర ప్రారంభించనుంది. యాత్ర ప్రారంభానికి ముందు శ్రీపెరంబ‌దూర్‌లో ఉన్న మాజీ ప్ర‌ధాని రాజీవ్‌గాంధీ స్మార‌కం వ‌ద్ద రాహుల్ నివాళి అర్పించారు. విద్వేష‌, విభ‌జ‌న రాజ‌కీయాల‌కు త‌న తండ్రి బ‌ల‌య్యాడ‌ని, కానీ అటువంటి విద్వేష రాజ‌కీయాల‌కు దేశాన్ని వ‌దులుకోవ‌డానికి సిద్ధంగా లేన‌ని రాహుల్ ఇవాళ త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపారు. ద్వేషాన్ని ప్రేమ జ‌యిస్తుంద‌ని, భ‌యాన్ని ఆశ జ‌యిస్తుంద‌ని, క‌లిసిక‌ట్టుగా మ‌నం అన్నింటిలో విజ‌యం సాధిస్తామ‌ని రాహుల్ త‌న ట్వీట్‌లో వెల్ల‌డించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)