Congress Second List: 43 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ పార్టీ రెండో జాబితా విడుదల, అస్సాం, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ నుంచి అభ్యర్థులు ప్రకటన
అస్సాం, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులను రెండో జాబితాలో ప్రకటించారు.
రానున్న లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే 43 మంది అభ్యర్థులతో రెండో జాబితా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ విడుదల చేశారు. అస్సాం, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులను రెండో జాబితాలో ప్రకటించారు. ఈ జాబితాలో జనరల్ కేటగిరీకి చెందిన 10 మంది అభ్యర్థులు, 13 మంది ఓబీసీలు, 10 మంది షెడ్యూల్ కులాల అభ్యర్థులు, 9 మంది షెడ్యూల్డ్ తెగ అభ్యర్థులు, ఒకరు ముస్లిం అభ్యర్థి ఉన్నట్లు కేసీ వేణుగోపాల్ తెలిపారు. హర్యానా నూతన ముఖ్యమంత్రిగా నయాబ్ సింగ్ సైనీ, సీఎం పదవికి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా, ఇంతకీ ఎవరీ సైనీ ?
అస్సాం నుంచి 12 మంది, గుజరాత్ నుంచి 7 మంది, మధ్యప్రదేశ్ 10 మంది, రాజస్థాన్ 10 మంది, ఉత్తరాఖండ్ 3, డయ్యూ అండ్ డామన్ నుంచి ఒక్కరికి రెండు జాబితాలో చోటు దక్కింది. మధ్యప్రదేశ్‌లోని చింద్వారా సెగ్మెంట్ నుంచి మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ కుమారుడు నకుల్‌నాథ్‌ను మరోసారి బరిలోకి దింపింది. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ కుమారుడు వైభవ్ గెహ్లాత్‌కు రాజస్థాన్‌లోని జలోర్ సెగ్మెంట్‌ను కేటాయించారు. బీజేపీకీ రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన రాహుల్ కుశ్వాన్‌ను రాజస్థాన్‌లోని చురూ లోకసభ నియోజకవర్గం బరితో దింపింది.
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)