Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికలకు 36 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్, తెలంగాణ నుంచి బరిలో ఉన్న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు వీరే
మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థిగా ఇప్పటికే వంశీచందర్‌రెడ్డిని ప్రకటించిన విషయం తెలిసిందే.
వచ్చే లోక్‌సభ ఎన్నికలకు 36 మంది అభ్యర్థులతో తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. తెలంగాణలో మొత్తం 17 ఎంపీ స్థానాలు ఉండగా.. ప్రస్తుతం 4 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. జహీరాబాద్ - సురేశ్ షేట్కర్, చేవెళ్ల - సునీతా మహేందర్‌రెడ్డి, నల్గొండ - కుందూరు రఘువీర్‌రెడ్డి, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్‌లను అభ్యర్థులుగా అధిష్ఠానం ఖరారు చేసింది. మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థిగా ఇప్పటికే వంశీచందర్‌రెడ్డిని ప్రకటించిన విషయం తెలిసిందే.వయానాడ్ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తారు.గత ఎన్నికల్లోనూ రాహుల్ ఇక్కడి నుంచే పోటీ చేసి గెలిచారు. కర్ణాటకలోని శివమొగ్గ నుంచి గీతా శివకుమార్ పోటీ చేయనున్నారు. బెంగళూరు రూరల్ నుంచి డీకే సురేశ్ పోటీ చేస్తారు.
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)