Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికలు, వయనాడ్ నుంచి నామినేషన్ వేసిన రాహుల్ గాంధీ, వీడియో ఇదిగో..
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానానికి బుధవారం నామినేషన్ వేశారు. వయనాడ్ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న రాహుల్.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి ఇక్కడి నుంచి బరిలో నిలిచారు. ఈ క్రమంలోనే నేడు కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానానికి బుధవారం నామినేషన్ వేశారు. వయనాడ్ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న రాహుల్.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి ఇక్కడి నుంచి బరిలో నిలిచారు. ఈ క్రమంలోనే నేడు కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. రాహుల్ వెంట తన సోదరి ప్రియాంక గాంధీ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, ఇతర పార్టీ సీనియర్ నేతలు కూడా ఉన్నారు. 2019 ఎన్నికల్లో వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ ఏడు లక్షల ఓట్లను సాధించారు. సమీప అభ్యర్థి సీపీఐ అభ్యర్ధి సునీర్‌పై 4.31 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)