Lok Sabha Elections 2024: కాంగ్రెస్ కంచుకోటలో తొలిసారిగా గాంధీయేతర వ్యక్తి పోటీ, అమేథీ నుంచి స్మృతి ఇరానీపై కిషోరీలాల్ శర్మ పోటీ, రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ బరిలోకి..
కాంగ్రెస్(congress) పార్టీ అమేథీ(Amethi), రాయ్‌బరేలీ(rae bareli) లోక్‌సభ స్థానాల నుంచి అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ రాయ్‌బరేలీ కాంగ్రెస్ అభ్యర్థిగా రాహుల్ గాంధీ పేరును అధికారికంగా ప్రకటించింది. అమేథీ నుంచి కిషోరీలాల్ శర్మను బరిలో దించనుంది.
కాంగ్రెస్(congress) పార్టీ అమేథీ(Amethi), రాయ్‌బరేలీ(rae bareli) లోక్‌సభ స్థానాల నుంచి అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ రాయ్‌బరేలీ కాంగ్రెస్ అభ్యర్థిగా రాహుల్ గాంధీ పేరును అధికారికంగా ప్రకటించింది. అమేథీ నుంచి కిషోరీలాల్ శర్మను బరిలో దించనుంది. సోనియా గాంధీ రాయ్‌బరేలీ ఎంపీగా ఉన్న టైంలో కేఎల్ శర్మ అన్ని వ్యవహరాలను చూసుకునేవారు. రాహుల్ గాంధీ రాయ్‌బరేలీ నుంచి పోటీ చేస్తుండడంతో.. సోనియా గాంధీ తనయ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దాదాపు దూరం అయ్యారనే చెప్పాలి.లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఇప్పటికే వయనాడ్(కేరళ) నుంచి పోటీ చేస్తున్నారు
Here's ANI News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)