Maharashtra Political Drama: శివసేన రెబల్ ఎమ్మెల్ షిండే ఫోటోపై కోడిగుడ్లు విసిరిన కార్యకర్తలు, పోస్టర్‌పై ఇంక్‌ చల్లి నిరసన

మహారాష్ట్రలో పాలక మహా వికాస్‌ అఘాడీ (ఎంవీఏ) సంకీర్ణానికి సారథ్యం వహిస్తున్న శివసేనలో కీలక నేత అయిన షిండే తిరుగుబాటుతో ఆ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం మొదలైన సంగతి తెలిసిందే. దీంతో తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ షిండేపై ఆ పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Shiv Sena supporters throw black ink and eggs at a poster s

మహారాష్ట్రలో పాలక మహా వికాస్‌ అఘాడీ (ఎంవీఏ) సంకీర్ణానికి సారథ్యం వహిస్తున్న శివసేనలో కీలక నేత అయిన షిండే తిరుగుబాటుతో ఆ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం మొదలైన సంగతి తెలిసిందే. దీంతో తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ షిండేపై ఆ పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షిండేకు వ్యతిరేకంగా జరిగిన తాజా నిరసనలో నాసిక్‌లో కొందరు శివసేన కార్యకర్తలు అతని పోస్టర్‌పై ఇంక్‌ చల్లడంతో పాటు కోడిగుడ్లు విసిరి నిరసనను తెలిపారు. ఇంతకు ముందు కూడా రెబల్ పార్టీ నేత ఏక్‌నాథ్ షిండేతో కలిసి గౌహతి క్యాంప్‌లో ఉన్న తిరుగుబాటు ఎమ్మెల్యే సదా సర్వాంకర్‌ పోస్టర్‌పై ‘మోసగాడు’ అని రాసి శివసేన కార్యకర్తలు తమ నిరసనను తెలిపారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now