Manohar Lal Khattar Resigns As Haryana CM: హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా, తెగిన బీజేపీ- జేజేపీ బంధం, కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం
హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మంగళవారం రాజీనామా చేశారు. లోక్‌సభ స్థానాల విషయంలో దుష్యంత్ చౌతాలాకు చెందిన జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)తో బీజేపీ పొత్తు తెగిపోయింది. 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఖట్టర్ పోటీ చేయవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.
హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మంగళవారం రాజీనామా చేశారు. లోక్‌సభ స్థానాల విషయంలో దుష్యంత్ చౌతాలాకు చెందిన జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)తో బీజేపీ పొత్తు తెగిపోయింది. 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఖట్టర్ పోటీ చేయవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. నివేదిక ప్రకారం, JJP లోక్‌సభ ఎన్నికల్లో 2 సీట్లు కోరుకుంది, అయితే BJP మొత్తం 10 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తామని తెలిపింది.
ఇక 90 స్థానాలున్న హర్యానా అసెంబ్లీలో బీజేపీకి 41, జేజేపీకి 10, కాంగ్రెస్‌కు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీనితో పాటు బీజేపీకి ఆరుగురు స్వతంత్రులు, ఒక హర్యానా లోఖిత్ పార్టీ ఎమ్మెల్యే గోపాల్ కందా మద్దతు ఉంది. ఈ లెక్కన.. జేజేపీ విడిపోయిన తర్వాత కూడా బీజేపీకి 48 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటుందని లెక్క తేలుతోంది.హర్యానా కేబినెట్ నుంచి జననాయక్ జనతా పార్టీని తప్పించేందుకే బీజేపీ ఈ వ్యూహం పన్నిందని వార్తలు వస్తున్నాయి.
Here's News