Rajya Sabha Elections 2024: రాజస్థాన్ నుంచి రాజ్యసభకు సోనియా గాంధీ, రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ, పూర్తి లిస్టు ఇదిగో..

రాజ్యసభ ఎన్నికల బరిలో నిలవనున్న అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఆ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు పోటీ చేయనున్నారు. ఇక హిమాచల్ ప్రదేశ్ నుంచి అభిషేక్ మను సింఘ్వీ, మహారాష్ట్రం నుంచి చంద్రకాంత్ హాండోర్‌ నామినేషన్ దాఖలు చేయనున్నారని వెల్లడించింది.

Sonia Gandhi during public meeting in Hubbali on May 6 (File Photo/ANI)

రాజ్యసభ ఎన్నికల బరిలో నిలవనున్న అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఆ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు పోటీ చేయనున్నారు. ఇక హిమాచల్ ప్రదేశ్ నుంచి అభిషేక్ మను సింఘ్వీ, మహారాష్ట్రం నుంచి చంద్రకాంత్ హాండోర్‌ నామినేషన్ దాఖలు చేయనున్నారని వెల్లడించింది. ఈ మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సర్క్యూలర్ విడుదల చేశారు. ఈ మేరకు అభ్యర్థులకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదం తెలిపారని ప్రస్తావించారు.తాజాగా కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేశారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, అశోక్ గెహ్లాట్, గోవింద్ సింగ్ దోతస్రా ఆమె వెంట ఉన్నారు.

Here's ANI Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement