Suresh Gopi To Quit Modi Cabinet? కేంద్ర క్యాబినెట్‌కు బీజేపీ ఎంపీ సురేష్ గోపీ రాజీనామా వార్తలు, క్లారిటీ ఇచ్చిన సినీ నటుడు
కేంద్ర క్యాబినెట్‌లో కొనసాగడంపై ఆసక్తి లేదంటూ తనపై వచ్చిన ఆరోపణలపై బీజేపీ (BJP) ఎంపీ సురేశ్ గోపి (Suresh Gopi) స్పందించారు. అదంతా తప్పుడు సమాచారమని కొట్టిపారేసిన ఆయన.. క్యాబినెట్ నుంచి వైదొలిగే ఉద్దేశం తనకు లేదని క్లారిటీ ఇచ్చారు.
కేంద్ర క్యాబినెట్‌లో కొనసాగడంపై ఆసక్తి లేదంటూ తనపై వచ్చిన ఆరోపణలపై బీజేపీ (BJP) ఎంపీ సురేశ్ గోపి (Suresh Gopi) స్పందించారు. అదంతా తప్పుడు సమాచారమని కొట్టిపారేసిన ఆయన.. క్యాబినెట్ నుంచి వైదొలిగే ఉద్దేశం తనకు లేదని క్లారిటీ ఇచ్చారు.ప్రధానితో సహా క్యాబినెట్ మంత్రిగా సురేశ్ గోపి ఆదివారం ప్రమాణం చేశారు. ఈనేపథ్యంలోనే తనకు కేంద్ర మంత్రి పదవిపై ఆసక్తి లేదని.. ఎంపీగా కొనసాగడమే ఇష్టమని ఆయన తెలిపినట్లు వార్తలు పుట్టుకొచ్చాయి. తన అభిప్రాయాన్ని అధిష్ఠానానికి తెలియజేశానని.. తుది నిర్ణయం పార్టీకే వదిలేస్తున్నానని ప్రమాణ కార్యక్రమం అనంతరం ఆయన మాట్లాడినట్లు ఫేక్ సమాచారం ప్రచారమైంది.
వార్తలు వైరల్ కావడంతో..ప్రధాని మోదీ నేతృత్వంలోని మంత్రిమండలికి నేను రాజీనామా చేస్తానంటూ కొన్ని మీడియా సంస్థలు తప్పుడు సమాచారం ప్రచారం చేశాయి. నాకు అలాంటి ఉద్దేశం లేదు. మోదీ నాయకత్వంలో కేరళ అభివృద్ధి, శ్రేయస్సుకు కట్టుబడి ఉన్నా’’ అని ఆయన స్పష్టం చేశారు.ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో త్రిశ్శూర్ నుంచి బీజేపీ ఎంపీగా పోటీ చేసిన సినీ నటుడు సురేశ్ గోపి 74 వేల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఈ విజయం ద్వారా కేరళలో తొలిసారి బీజేపీ ఖాతా తెరిచింది.
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)