Subhas Chandra Bose Jayanti 2023:నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి,నేతాజీ వీరోచిత పోరాటం మరువలేనిది అంటూ నివాళులు అర్పించిన ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌవది ముర్ము
నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌవది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. స్వతంత్ర పోరాటంలో నేతాజీ పాత్ర మరువలేనిదని కొనియాడారు. ఈమేరకు ఇద్దరు ట్వీట్ చేశారు.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌవది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. స్వతంత్ర పోరాటంలో నేతాజీ పాత్ర మరువలేనిదని కొనియాడారు. ఈమేరకు ఇద్దరు ట్వీట్ చేశారు.
'పరాక్రమ్ దివస్ సందర్భంగా భరతమాత ముద్దుబిడ్డ నేతాజీకి నివాళులు. ఆయన ధైర్యసాహసాలు, వీర పరాక్రమం, దేశభక్తి ఆదర్శనీయం. నేతాజీ నాయకత్వంలో లక్షలాది మంది స్వతంత్ర పోరాటంలో పాల్గొనేందుకు ముందుకువచ్చారు. ఆయనకు భారతీయులంతా ఎప్పటికీ రుణపడి ఉంటారు.' అని ద్రౌపది ముర్ము ట్వీట్ చేశారు.
'పరాక్రమ్ దివస్ సందర్భంగా నేతాజీకి నివాళులు. స్వతంత్ర పోరాటంలో ఆయన భాగస్వామ్యాన్ని స్మరించుకుందాం. బ్రిటిష్ పాలకులపై నేతాజీ వీరోచిత పోరాటం మరువలేనిది. ఆయన కలలుగన్న భారత్‌ను సాకారం చేసేందుకు కృషి చేస్తున్నాం.' అని మోదీ ట్వీట్ చేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని(జనవరి 23) కేంద్రం పరాక్రమ్ దివస్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే.
Here's Tweets
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)