418 Kidney Stones Removed From Patient: 60 ఏళ్ల వృద్ధుడి కిడ్నీ నుంచి 418 రాళ్లను తొలగించిన వైద్యులు, శరీరంపై కోత పెట్టకుండా కొద్దిపాటి శస్త్రచికిత్సతో రాళ్లను తొలగించిన ఏఐఎన్‌యూ వైద్యులు

హైదరాబాద్ లోని ఏషియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ) వైద్యులు అత్యాధునిక పరికరాలతో కొద్దిపాటి శస్త్రచికిత్స నిర్వహించి విజయవంతంగా ఈ రాళ్లను తొలగించారు.

418 Kidney Stones Removed From 60-Year-Old Patient by AINU Doctors (Photo-X/Coreena Enet Suares)

418 Kidney Stones Removed From 60-Year-Old Patient: 60 ఏళ్ల వృద్ధుడి కిడ్నీ నుంచి ఏకంగా 418 రాళ్లను వైద్యులు తీసేశారు. హైదరాబాద్ లోని ఏషియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ) వైద్యులు అత్యాధునిక పరికరాలతో కొద్దిపాటి శస్త్రచికిత్స నిర్వహించి విజయవంతంగా ఈ రాళ్లను తొలగించారు. ఈ శస్త్రచికిత్సలో డాక్టర్ కె.పూర్ణచంద్రారెడ్డి, డాక్టర్ గోపాల్ ఆర్ తక్, డాక్టర్ దినేశ్ పాలుపంచుకున్నారు. ఆ వృద్ధుడి కిడ్నీ 27 శాతం పనితీరు మాత్రమే కనబరుస్తున్నట్టు ఏఐఎన్ యూ డాక్టర్లు గుర్తించారు.  దేశంలోనే మొదటిసారిగా...కిడ్నీలో నుంచి 156 రాళ్లను తొలగించిన హైదరాబాద్ వైద్యులు, పెద్ద ఆపరేషన్‌ చేయకుండానే కీహోల్‌ పద్ధతిలో సర్జరీ పూర్తి

శరీరంపై అతి తక్కువ కోతతో కిడ్నీలో రాళ్లను తొలగించే పెర్కటేనియస్ నెఫ్రోలిథోటమీ (పీసీఎన్ఎల్) అనే ఆధునిక వైద్య విధానం ద్వారా 60 ఏళ్ల వృద్ధుడి కిడ్నీ నుంచి 418 రాళ్లను తొలగించారు.ఈ విధానంలో లేజర్ ఆధారిత ప్రత్యేకమైన పరికరాలను కిడ్నీలోకి చొప్పిస్తారు. వీటిలో ఓ సూక్ష్మ కెమెరా కూడా ఉంటుంది. ఇది విప్లవాత్మక విధానం అని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కిడ్నీ రాళ్ల బాధితులకు ఇది ఆశాదీపం వంటిదని ఏఐఎన్ యూ డాక్టర్లు అభివర్ణించారు. ఈ విధానంలో శరీరంపై ఎక్కువ కోత పెట్టాల్సిన అవసరం ఉండదని వారు తెలిపారు.

Here's News