IPL Auction 2025 Live

Jagannath Rath Yatra: వీడియో ఇదిగో, 250 కొబ్బరికాయలతో జగన్నాథ రథయాత్ర శిల్పం, సముద్ర తీరంలో అద్భుతాన్ని సృష్టించిన సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌

భక్తులు తండోపతండాలుగా ఆలయాలకు తరలివెళ్తున్నారు. ఈ క్రమంలో ఒడిశాకు చెందిన సైకత శిల్పి (Sand artist) సుదర్శన్‌ పట్నాయక్‌ (Sudarsan Pattnaik).. సముద్ర తీరంలో ఓ అద్భుతాన్ని సృష్టించారు

Jagannath Rath Yatra (photo-ANI)

జగన్నాథుని రథయాత్ర పూరీలో ఘనంగా ప్రారంభమైంది. భక్తులు తండోపతండాలుగా ఆలయాలకు తరలివెళ్తున్నారు. ఈ క్రమంలో ఒడిశాకు చెందిన సైకత శిల్పి (Sand artist) సుదర్శన్‌ పట్నాయక్‌ (Sudarsan Pattnaik).. సముద్ర తీరంలో ఓ అద్భుతాన్ని సృష్టించారు. బంగాళాఖాతం తీరానగల పూరీ బీచ్‌లో పూరీ జగన్నాథ రథయాత్రను ప్రతిబింబించేలా సైకత శిల్పాన్ని రూపొందించారు.

ఈ సైకత శిల్పం రూపకల్పనలో రకరకాల రంగులను, 250 కొబ్బరికాయలను సుదర్శన్‌ పట్నాయక్‌ ఉపయోగించారు. ఈ కింది వీడియోలో పట్నాయక్‌ సృష్టించిన ఆ అద్భుత సైకత శిల్పాన్ని వీక్షించవచ్చు.

ANI Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)