Devara Part 1 Trailer: గూస్ బంప్స్ తెప్పిస్తున్న దేవర ట్రైలర్, కేక పుట్టించేలా సముద్ర తీరంలో జరిగే పోరాట సన్నివేశాలు, పవర్‌ఫుల్ లుక్‌లో జూనియర్ ఎన్టీఆర్
బాలీవుడ్ వేదికగా దేవర ట్రైలర్‌ను తెలుగు,హిందీ,తమిళ్,కన్నడ,మలయాళం భాషలలో విడుదల చేశారు. ట్రైలర్‌లో ఎన్టీఆర్ చాలా పవర్‌ఫుల్ లుక్‌లో కనిపిస్తున్నారు.
కొరటాల శివ డైరెక్షన్‌లో జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'దేవర' ట్రైలర్ విడుదలైంది. బాలీవుడ్ వేదికగా దేవర ట్రైలర్‌ను తెలుగు,హిందీ,తమిళ్,కన్నడ,మలయాళం భాషలలో విడుదల చేశారు. ట్రైలర్‌లో ఎన్టీఆర్ చాలా పవర్‌ఫుల్ లుక్‌లో కనిపిస్తున్నారు. బ్లాక్ షేడ్‌లో కనిపించే విజువల్స్‌తో పాటు సముద్ర తీరంలో జరిగే పోరాట సన్నివేశాలు కేక పుట్టించేలా ఉన్నాయి.
దేవర చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నందమూరి కల్యాణ్‌రామ్ సమర్పకులు. ఎన్టీఆర్‌కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటించారు. ప్రకాశ్‌రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, నరైన్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. సల్మాన్ ఖాన్ డ్యాన్స్ వీడియో ఇదిగో, వినాయక చవితి వేడుకల్లో చిన్నపిల్లలతో కలిసి చిందేసిన బాలీవుడ్ హీరో
ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 27న విడుదల కానున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అశలు ఉన్నాయి. ఈ క్రమంలో ఓవర్సీస్‌లో భారీగా టికెట్లు అమ్ముడుపోయాయి. ఇప్పటికే అక్కడ సుమారు 11 లక్షలకు పైగా టికెట్ల విక్రయం జరిగింది.
Here's ‘Devara’ Part 1 Trailer (Telugu)
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)