Sonu Sood at Kumari Aunty Food Stall: వీడియో ఇదిగో, కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ వద్ద సందడి చేసిన సోనూ సూద్, ఫ్రీగా పెడతానంటే రోజు వస్తానని చమత్కారం
సోనూసూద్ సోషల్ మీడియాలో ఫేమస్ అయిన కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ కి వెళ్లి ఆమెకు మద్దతు పలికాడు. తాను ఇప్పుడు కుమారి ఆంటీతో ఉన్నానని ఆమె గురించి చాలా విన్నానని సోనుసూద్ చెప్పుకొచ్చాడు
కరోనా సమయంలో చాలా మందికి సహాయం చేసిన సోనూ సూద్ తాజాగా హైదరాబాద్ కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ వద్ద సందడి చేశాడు. తాను ఇప్పుడు కుమారి ఆంటీతో ఉన్నానని ఆమె గురించి చాలా విన్నానని సోనుసూద్ చెప్పుకొచ్చాడు. ఆమె తనను తాను ఈ స్థాయికి తెచ్చుకుందని వుమెన్ ఎంపవర్మెంట్ కి నిజమైన అర్థం ఇదేనని అన్నారు. కుటుంబాల కోసం స్త్రీలు ఎంత కష్టపడుతున్నారనేది కుమారి ఆంటీ సజీవ సాక్ష్యం అని సోనూసూద్ అన్నాడు. ఎవరి కుటుంబాలైతే ఇబ్బందుల్లో ఉన్నాయో వాళ్ళు కుమారి ఆంటీని చూసి నేర్చుకోవాలని ఇబ్బందుల్లో కూడా సరైన దారి ఎంచుకుంటే ఆర్థికంగా నిలదొక్కుకోకపోవచ్చు అని నిరూపించిందని అన్నారు. దొంగతనం చేసిన స్విగ్గీ డెలవరీ బాయ్ కు మద్దతుగా నిలిచిన సోనూసూద్, దొంగకు సపోర్ట్ చేస్తున్నావంటూ ఫైరవుతున్న నెటిజన్లు
తాను వెజిటేరియన్ తింటానని ప్లేట్ ఎంత అని అడిగితే కుమార్ ఏంటి 80 రూపాయలు అని చెప్పింది. అయితే తనకి ఎంత డిస్కౌంట్ ఇస్తారు అని అడిగితే మీకైతే ఫ్రీగానే పెడతానని చెప్పుకొచ్చింది. అయితే నాకు లాటరీ తగిలింది ఫ్రీగా పెడతానంటే రోజు వస్తానని సోనూసూద్ అంటే మీరు ఎంతోమందికి సాయం చేశారు మీకు మేము ఎంత పెట్టినా తక్కువే అని కుమారి ఆంటీ చెప్పు వచ్చింది. ఇక ఈ సందర్భంగా కుమారి ఆంటీని సోను సత్కరించాడు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)