Allu Arjun: వీడియో ఇదిగో, నాకు ఇష్టమైతే ఎంత దూరమైనా వస్తా, అది మన ఫ్రెండ్ అయినా, కావాల్సిన వాళ్లు అయినా..అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు
మారుతినగర్ సుబ్రమణ్యం సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సుకుమార్‌గారి భార్య తబితగారు వచ్చి ‘మారుతినగర్ సుబ్రమణ్యం’ సినిమాని నేను సమర్పిస్తున్నాను.. ప్రీ రిలీజ్ వేడుకకి రావాలని అడగ్గానే వస్తానని చెప్పాను.
మారుతినగర్ సుబ్రమణ్యం సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సుకుమార్‌గారి భార్య తబితగారు వచ్చి ‘మారుతినగర్ సుబ్రమణ్యం’ సినిమాని నేను సమర్పిస్తున్నాను.. ప్రీ రిలీజ్ వేడుకకి రావాలని అడగ్గానే వస్తానని చెప్పాను. ఎందుకంటే మనకి ఇష్టమైన వాళ్లకి మనం సపోర్ట్‌గా నిలబడగలగాలి. అది మన ఫ్రెండ్ అయినా, కావాల్సిన వాళ్లు అయినా. నాకు ఇష్టమైతేనే నేను వస్తా.. నా మనసుకు నచ్చితే నేను వస్తా. అది మీ అందరికీ తెలిసిందే’’ అని హీరో అల్లు అర్జున్ అన్నారు. ‘‘పుష్ప 2: ది రూల్’ క్లైమాక్స్ షూటింగ్‌లో ఉన్నా. నా జీవితంలో ఎంతో క్లిష్టమైన క్లైమాక్స్ షూటింగ్ ఉన్నా వచ్చానని తెలిపారు. రోడ్డు పక్కన కారు ఆపి అభిమానికి సర్‌ప్రైజ్ ఇచ్చిన రానా, ఫ్యామిలీతో, అభిమానులతో సరదాగా మాట్లాడుతున్న వీడియో వైరల్
రావు రమేష్, ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం ‘మారుతినగర్ సుబ్రమణ్యం’. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. తబితా సుకుమార్ సమర్పణలో బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మించిన ఈ మూవీ ఈ నెల 23న విడుదలకానుంది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)