Amitabh Bachchan’s Tweet: హేయ్‌ ట్విటర్‌ అంటూ అమితాబ్ ట్వీట్ వైరల్, డబ్బులు చెల్లించా బ్లూ టిక్‌ మార్కు తిరిగివ్వు, బ్లూ టిక్‌ తిరిగిస్తేనే నేను అమితాబ్‌బచ్చన్‌ అని జనాలకు తెలుస్తుందని ట్వీట్

సబ్‌స్క్రిప్షన్‌ సేవలకు సంబంధించిన రుసుములు చెల్లించలేదన్న కారణంతో ట్విటర్‌ ఇవాళ పలువురు సినీ, రాజకీయ, క్రీడా రంగ ప్రముఖుల పేర్ల ముందు బ్లూ టిక్‌ మార్కును తొలగించిన సంగతి విదితమే. సబ్‌స్క్రప్షన్‌ సేవలకు రుసుము చెల్లించినా తన పేరు ముందున్న బ్లూ టిక్‌ మార్కును తొలగించడంపై బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ స్పందించారు.

Amitabh Bachchan (Photo Credits: Instagram)

సబ్‌స్క్రిప్షన్‌ సేవలకు సంబంధించిన రుసుములు చెల్లించలేదన్న కారణంతో ట్విటర్‌ ఇవాళ పలువురు సినీ, రాజకీయ, క్రీడా రంగ ప్రముఖుల పేర్ల ముందు బ్లూ టిక్‌ మార్కును తొలగించిన సంగతి విదితమే. సబ్‌స్క్రప్షన్‌ సేవలకు రుసుము చెల్లించినా తన పేరు ముందున్న బ్లూ టిక్‌ మార్కును తొలగించడంపై బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ స్పందించారు.

హేయ్‌ ట్విటర్‌.. నువ్వు వింటున్నావా..? సబ్‌స్క్రిప్షన్‌ సేవల కోసం నేను రుసుము చెల్లించా. కాబట్టి నా పేరు ముందు బ్లూ టిక్‌ మార్కును దయచేసి తిరిగి ఇచ్చేయండి. బ్లూ టిక్‌ తిరిగిస్తేనే నేను అమితాబ్‌బచ్చన్‌ అని జనాలకు తెలుస్తుంది. నేను చేతులు జోడించి అభ్యర్థిస్తున్నా” అని అమితాబ్‌ తన ట్విటర్‌ హ్యాండిల్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్‌ తెగ వైరల్‌ అవుతున్నది.

Here's Tweet

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement