Anant-Radhika Wedding Card: అనంత్ అంబానీ-రాధిక మ‌ర్చంట్ వెడ్డింగ్ కార్డు చూస్తే మతిపోవాల్సిందే, వైరల్ అవుతున్న పెళ్లి కార్డు వీడియో ఇదిగో..

రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మ‌ర్చంట్ వివాహం జులై 12న జ‌ర‌గ‌నుంది. పెళ్లి ఏర్పాట్ల మధ్య అంబానీ ఫ్యామిలీ పెళ్లి కార్డులను కూడా పంచిపెడుతోంది. ఈ క్ర‌మంలో అంబానీ పెళ్లి ప‌త్రిక తాలూకు వీడియో ఒక‌టి తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది.

Anant Ambani-Radhika Merchant’s Silver-Themed Wedding Card Featuring Lord Ganpati and Goddess Durga Goes Viral

రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మ‌ర్చంట్ వివాహం జులై 12న జ‌ర‌గ‌నుంది. పెళ్లి ఏర్పాట్ల మధ్య అంబానీ ఫ్యామిలీ పెళ్లి కార్డులను కూడా పంచిపెడుతోంది. ఈ క్ర‌మంలో అంబానీ పెళ్లి ప‌త్రిక తాలూకు వీడియో ఒక‌టి తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ వెడ్డింగ్ కార్డ్ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

వివాహ ఆహ్వాన ప‌త్రికను ఒక ప్ర‌త్యేక పెట్టె రూపంలో తీర్చిదిద్దారు. దీనికి లైట్లు, ఎరుపు రంగుతో అలంకరించారు. ఇక బాక్స్ ఓపెన్ చేయ‌గానే ఓం అంటూ మంత్రం వినిపిస్తుంది. అందులో వెండితో చేసిన ఆల‌యం క‌నిపిస్తుంది. ఆ ఆలయం లోప‌ల వెండితోనే చేసిన‌ వినాయ‌కుడు, దుర్గామాత‌, రాధాకృష్ణ విగ్ర‌హాలు ఉన్నాయి. దేవుళ్ల‌ శిల్పాలతో తయారు చేయబడిన ఈ ఆహ్వాన ప‌త్రిక ఒక చ‌క్క‌టి కళాఖండాన్ని త‌ల‌పిస్తుంది. అతిథుల‌కు ఈ వెండి కార్డుతో పాటు ప‌లు బహుమతులు కూడా ఇస్తున్న‌ట్లు స‌మాచారం. వీవీఐపీ అతిథులకు అంబానీ కుటుంబ సభ్యులే స్వయంగా వెళ్లి కార్డులు ఇస్తున్నారట‌. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జ‌ర‌గ‌నుంది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement