Video: వీడియో ఇదిగో, స్మార్ట్‌గా హుండీలో నుంచి డబ్బులు కాజేసిన ఆలయ సెక్యూరిటీ అధికారి, కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఘటన
అనంతపురం జిల్లాలోని కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థానంలో సెక్యూరిటీ గార్డ్‌గా విధులు నిర్వహిస్తున్న కృష్ణారెడ్డి చేతివాటం ప్రదర్శించారు. హుండీలో నుంచి డబ్బులు దొంగతనం చేశారు. దీనికి సంబంధించిన సీసీ పుటేజీ వెలుగులోకి వచ్చింది. వీడియో ఇదిగో..
అనంతపురం జిల్లా కసాపురంలోని నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి ఆలయంలోని హుండీలో నగదు చోరీ కలకలం రేపుతోంది. దేవస్థాన చీఫ్ సెక్యూరిటీ అధికారి కృష్ణారెడ్డి ఈ దొంగతనానికి పాల్పడ్డాడు. అతడు హుండీలో చేయి పెట్టి డబ్బు తీస్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. కృష్ణారెడ్డిని విధుల నుంచి తొలగించి.. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)