'Baby Sanjay' to 'Dr Sanjay': 25 ఏండ్ల క్రితంనాటి కాలేయ మార్పిడి పిల్లాడు గుర్తుండా? ఇప్పుడు అతను డాక్టరయ్యాడు.. ఏంటా సంగతి??
20 నెలల చిన్న పిల్లాడికి చేసిన ‘కాలేయ మార్పిడి’ శస్త్ర చికిత్స సక్సెస్ అవ్వటం న్యూఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో దవాఖాన వైద్యుల్ని ఆనందంలో ముంచెత్తింది.
Newdelhi, Nov 19: భారత్ (India) లో 25 ఏండ్ల క్రితం మొట్టమొదటి ‘చైల్డ్ లివర్ ట్రాన్స్ ప్లాంట్’ (Child Liver Transplant) జరిగింది. 20 నెలల చిన్న పిల్లాడికి చేసిన ‘కాలేయ మార్పిడి’ శస్త్ర చికిత్స సక్సెస్ (Success) అవ్వటం న్యూఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో దవాఖాన వైద్యుల్ని ఆనందంలో ముంచెత్తింది. ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడై నేడు ఓ డాక్టర్ అవడంతో.. ఆ వైద్యుల మనస్సు గర్వంతో ఉప్పొంగింది. ఆనాటి లివర్ మార్పిడి జరిగిన తమిళనాడుకు చెందిన సంజయ్ కందసామి ఎంబీబీఎస్ చదువుకొని కాంచీపురంలోని స్థానిక దవాఖానలో వైద్యుడిగా సేవలు అందిస్తున్నాడు. ఇది తమకు ఎంతగానో గర్వకారణమని శస్త్ర చికిత్స వైద్యుల బృందంలో ఒకరైన అనుపమ్ అన్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)