Chit-Chat Break: ఏందయ్యా శశిథరూర్‌ ఇది.., మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కాంగ్రెస్ ఎంపీ, ఇంతకీ ఈ వైరల్ న్యూస్ మీద ఆయన రియాక్షన్ ఏంటంటే..

కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ తాజా ఘటనతో సోషల్‌ మీడియా ట్రెండింగ్‌లో నిలిచారు. లోక్‌సభలో జమ్ము క‌శ్మీర్ మాజీ సీఎం ఫ‌రూక్ అబ్దుల్లా మాట్లాడుతుండగా శశి ఎన్సీపీ ఎంపీ సుప్రియాసూలేతో చిట్ ఛాట్ చేస్తూ కెమెరాకు చిక్కారు. దీనిపై సోష‌ల్‌మీడియాలో స‌ర‌దా మీమ్స్ చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

MP Shashi Tharoor

కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ తాజా ఘటనతో సోషల్‌ మీడియా ట్రెండింగ్‌లో నిలిచారు. లోక్‌సభలో జమ్ము క‌శ్మీర్ మాజీ సీఎం ఫ‌రూక్ అబ్దుల్లా మాట్లాడుతుండగా శశి ఎన్సీపీ ఎంపీ సుప్రియాసూలేతో చిట్ ఛాట్ చేస్తూ కెమెరాకు చిక్కారు. దీనిపై సోష‌ల్‌మీడియాలో స‌ర‌దా మీమ్స్ చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంపై లోక్‌సభలో జమ్ము క‌శ్మీర్ మాజీ సీఎం ఫ‌రూక్ అబ్దుల్లా మాట్లాడుతుండగా.. శశిథరూర్‌ ఎన్సీపీ ఎంపీ సుప్రియాసూలేతో మాట్లాడుతూ కనిపించారు. ముందు సీటులో ఆమె కూర్చొని ఉండగా.. శశిథరూర్‌ వెనుక సీట్‌లో బల్లపై తల ఆనించి పడుకుని నవ్వుతూ కాసేపు ముచ్చటించారు. ఓ వైపు ఫరూక్‌ అబ్దుల్లా సీరియస్‌గా ప్రసంగిస్తుండగా శశిథరూర్‌ ఫన్నీగా ఆమెతో మాట్లాడారు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టడంతో నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్‌ చేస్తున్నారు.దీనిపై శశిధరూర్ స్పందించారు. పార్లమెంటును రెండు రోజుల ముందుగానే వాయిదా వేయడానికి బదులుగా, ఇంధన ధరల పెరుగుదల & వినియోగదారుల ద్రవ్యోల్బణంపై తీవ్రమైన చర్చను వినడానికి ప్రభుత్వం ధైర్యం చేసి ఉండాలని తెలిపారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now