Cobra Swallows Cough Syrup Bottle: వీడియో ఇదిగో, ఖాళీ దగ్గు మందు సీసాను మింగిన తాచుపాము, అది నోట్లో ఇరుక్కుపోవడంతో శ్వాస ఆడక విలవిల

ఒడిషా రాజధాని భువనేశ్వర్ లో తాచు పాము దగ్గు మందును మింగాలని చూసి చివరకు కక్కలేక ఇబ్బందిపడింది. స్నేక్ హెల్ప్ లైన్ వాలంటీర్లు రిస్క్ తీసుకొని పామును కాపాడారు. దాని కింది దవడను నెమ్మదిగా వెడల్పు చేయడం ద్వారా సీసాను కక్కేలాగా చేసి ఒక విలువైన ప్రాణాన్ని కాపాడారు

Cobra Swallows Cough Syrup Bottle

ఒడిషా రాజధాని భువనేశ్వర్ లో తాచు పాము దగ్గు మందును మింగాలని చూసి చివరకు కక్కలేక ఇబ్బందిపడింది. స్నేక్ హెల్ప్ లైన్ వాలంటీర్లు రిస్క్ తీసుకొని పామును కాపాడారు. దాని కింది దవడను నెమ్మదిగా వెడల్పు చేయడం ద్వారా సీసాను కక్కేలాగా చేసి ఒక విలువైన ప్రాణాన్ని కాపాడారు.సుశాంతా నందా అనే ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్, వైల్డ్ లైఫ్ తన ‘ఎక్స్’ ఖాతాలో ఈ వీడియోను పంచుకున్నారు.

ఈ అంశం గురించి వైల్డ్ లైఫ్ వార్డెన్ సుభేందు మల్లిక్ వివరించారు. ‘మాకు విషయం తెలియగానే ఘటనాస్థలికి చేరుకున్నాం. మేము కొంత సాయం చేయడంతో ఆ పాము దగ్గు మందు సీసాను బయటకు కక్కగలిగింది. ఆహారంగా పొరబడటం వల్లే ఆ పాము సీసాను మింగింది. సీసా నోట్లో ఇరుక్కోవడం వల్ల ఆ పాము నొప్పితో బాధపడింది. దీనివల్ల అది చాలా నీరసించింది. నోట్లోంచి సీసా బయటకు వచ్చేశాక ఆ పామును అడవిలో విడిచిపెట్టాం’ అని మల్లిక్ వివరించారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు పామును కాపాడిన సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.  వీడియో ఇదిగో, రోడ్లపై పురుషులతో పాటు మహిళలు కూడా నగ్నంగా ప్రదర్శన, టొరంటో ప్రైడ్ పరేడ్ 2024పై మండిపడుతున్న నెటిజన్లు

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement