Mob Attacks Vaccine Team: మాకు వ్యాక్సిన్ వేస్తారా..సిబ్బందిపై క‌ర్ర‌ల‌తో గ్రామ‌స్థుల దాడి, కారులో పారిపోయిన అధికారులు, పంచాయతీ అధికారిణికి గాయాలు, ప‌రిస్థితులను అదుపులోకి తీసుకువచ్చిన పోలీసులు

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో వ్యాక్సిన్ సిబ్బందిపై దాడుల‌కు దిగారు. దీంతో వ్యాక్సిన్ సిబ్బంది ప్రాణ భ‌యంతో కారులో పారిపోవాల్సి వ‌చ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఒక‌రు ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు.

Mob Attacks Vaccine Team (Photo-Video Grab)

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో వ్యాక్సిన్ సిబ్బందిపై దాడుల‌కు దిగారు. దీంతో వ్యాక్సిన్ సిబ్బంది ప్రాణ భ‌యంతో కారులో పారిపోవాల్సి వ‌చ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఒక‌రు ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. ఉజ్జయిని జిల్లా మెయిల్‌ఖేడీ గ్రామంలో వ్యాక్సిన్ అంటేనే వ‌ణికిపోతోన్న గ్రామ‌స్థుల‌కు అవగాహన కల్పించేందుకు అధికారులు అక్క‌డ‌కు వెళ్లారు. వారి రాక‌ను ముందుగానే గుర్తించిన గ్రామస్థులు క‌ర్ర‌లు ప‌ట్టుకుని సిద్థంగా ఉన్నారు. వ్యాక్సిన్ సిబ్బంది గ్రామంలోకి అడుగుపెట్ట‌గానే రాళ్లు, కర్రలు పట్టుకుని కొట్ట‌డానికి దూసుకొచ్చారు. కొంద‌రు అధికారులు త‌ప్పించుకుని కారులో పారిపోగా, పంచాయతీ అధికారిణికి మాత్రం తీవ్రగాయాల‌య్యాయి. అనంత‌రం ఆ గ్రామంలోకి పోలీసులు వ‌చ్చి ప‌రిస్థితులు చేజారకుండా చ‌ర్య‌లు తీసుకున్నారు.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement