Crocodile Drags Woman Into River: వీడియో ఇదిగో, నదిలో బట్టలు ఉతుక్కుంటున్న మహిళను లాక్కెళ్లిన మొసలి, ఎంత భయంకరంగా ఉందంటే..
ఒడిశాలో ఖరాస్రోటా నదీ తీరం వద్ద శనివారం ఒక భయంకర సంఘటన వెలుగుచూసింది. జజ్‌పూర్ జిల్లాలోని ఓ గ్రామంలో, నదీ తీరానికి దుస్తులు ఉతుక్కునేందుకు వెళ్లిన 55 ఏళ్ల సౌదామినీ మహాలా అనే మహిళపై అకస్మాత్తుగా మొసలి దాడి చేసింది. మహిళను నోట కరిచి, ఆమెను నీటిలోకి లాగేసింది. ఈ దారుణం స్థానికులను షాక్‌కి గురిచేసింది.
ఒడిశాలో ఖరాస్రోటా నదీ తీరం వద్ద శనివారం ఒక భయంకర సంఘటన వెలుగుచూసింది. జజ్‌పూర్ జిల్లాలోని ఓ గ్రామంలో, నదీ తీరానికి దుస్తులు ఉతుక్కునేందుకు వెళ్లిన 55 ఏళ్ల సౌదామినీ మహాలా అనే మహిళపై అకస్మాత్తుగా మొసలి దాడి చేసింది. మహిళను నోట కరిచి, ఆమెను నీటిలోకి లాగేసింది. ఈ దారుణం స్థానికులను షాక్‌కి గురిచేసింది.ఈ షాకింగ్ ఘటనను స్థానికులు తమ ఫోన్లలో చిత్రీకరించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. మహిళను కాపాడేందుకు చుట్టుపక్కల వారు ప్రయత్నించినప్పటికీ, రెప్పపాటులోనే మొసలి ఆమెను నీటిలోకి లాగేసింది. ఈ ఘటనను చూసిన గ్రామస్తులు నిస్సహాయంగా హాహాకారాలు చేశారు.
వెంటనే అటవీ శాఖ, అగ్నిమాపక శాఖ సిబ్బంది మహిళను గుర్తించి, రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. నది సమీప ప్రాంతాల్లో గస్తీని పెంచి, ప్రజలు అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారని అధికారులు వెల్లడించారు. నదీ తీరం వద్దకు వెళ్లకూడదని స్థానికులను హెచ్చరించారు.గ్రామస్తులు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ ఘటనతో రాస్రోటా నది తీరం ప్రాంతం లో భయాందోళనలు రేకెత్తాయి. ప్రజలు ఇప్పటికే నది ప్రాంతానికి వెళ్ళే ప్రయత్నం తగ్గించారు. అటవీ శాఖ అధికారులు మరిన్ని రక్షణ చర్యలు తీసుకుంటూ, స్థానికులను అప్రమత్తం చేస్తున్నారు.
Crocodile Drags Woman Into River:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)