Biryani Order: బాగా తప్ప తాగిన ముంబై యువతి, మత్తులో బెంగుళూరు నుంచి రూ. 2500 పెట్టి బిర్యాని ఆర్డర్, మత్తు దిగిన తర్వాత విషయం తెలిసి షాక్
ముంబైకి చెందిన ఓ యువతి ఫుల్‌గా మద్యం సేవించి మత్తులో బెంగుళూరు నుంచి బిర్యానీ ఆర్డర్ చేసింది. యువతి మద్యం మత్తులో ఈనెల 21వ తేదీన జొమాటోలో బెంగళూరులోని మేఘనా ఫుడ్స్ నుంచి బిర్యానీ ఆర్డర్ చేసుకోగా మరునాడు ఫుడ్ డెలివరీ అయ్యింది. ఈ బిర్యాని ఖరీదు రూ.2500.ఈ విషయాన్ని సదరు యువతి సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.
ముంబైకి చెందిన ఓ యువతి ఫుల్‌గా మద్యం సేవించి మత్తులో బెంగుళూరు నుంచి బిర్యానీ ఆర్డర్ చేసింది. యువతి మద్యం మత్తులో ఈనెల 21వ తేదీన జొమాటోలో బెంగళూరులోని మేఘనా ఫుడ్స్ నుంచి బిర్యానీ ఆర్డర్ చేసుకోగా మరునాడు ఫుడ్ డెలివరీ అయ్యింది. ఈ బిర్యాని ఖరీదు రూ.2500.ఈ విషయాన్ని సదరు యువతి సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ‘నేను బెంగళూరు నుంచి రూ.2,500 విలువైన బిర్యానీని ఆర్డర్ చేశానా..?’ అంటూ పోస్టు చేసింది. ఆర్డర్ ప్లేస్‌కు సంబంధించిన పిక్‌ను ట్వీట్‌కు జతచేసింది. అనంతరం ఫుడ్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఫొటోలను సైతం పోస్ట్ చేసింది. ఈ ట్వీట్‌కు జొమాటో సైతం స్పందించింది. ‘ఆర్డర్ మీ ఇంటి వద్దకు చేరాకా.. మీ అనుభవం గురించి తెలియజేయండి’ అంటూ సరదాగా వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
Here's Her Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)