Audi Italy Chief Fabrizio Longo Dies : ట్రెక్కింగ్ చేస్తూ 10 వేల అడుగుల ఎత్తులో నుంచి కింద పడిన ఆడి కార్ల ఇటలీ బాస్ ఫాబ్రిజియో లాంగో, అక్కడికక్కడే మృతి

దురదృష్టవశాత్తు అతను ట్రెక్కింగ్ చేసేటప్పుడు 10 వేల అడుగుల ఎత్తైన కొండ నుంచి జారి పడ్డాడు.

Audi Italy Head Fabrizio Longo (Photo Credit: Wikimedia Commons, LinkedIn)

ఇటలీలో ఆడి కార్ల కంపెనీ బాస్ ఫాబ్రిజియో లాంగో ప్రమాదవశాత్తు పెద్ద లోయలో పడి చనిపోయాడు.62ఏళ్ల ఫాబ్రిజియో వీకెండ్ ట్రెక్కింగ్ కోసం సెప్టెంబర్ 1న ఇటలీ, స్విస్ దేశాల సరిహద్దలో ఉన్న కొండ ప్రాంతానికి వెళ్లాడు. దురదృష్టవశాత్తు అతను ట్రెక్కింగ్ చేసేటప్పుడు 10 వేల అడుగుల ఎత్తైన కొండ నుంచి జారి పడ్డాడు. ఎమర్జెన్సీ సర్వీస్ కోసం అతనితోపాటు ఉన్న వ్యక్తి సంబంధిత అధికారుల‌కు స‌మాచారం అందించ‌డంతో హెలికాఫ్టర్‌లో వచ్చిన రెస్క్యూ బృందం అతన్ని 700 అడుగుల లోతులో చిక్కుకుని ఉండటం గమనించారు. అప్పటికే ఆయన చనిపోయిన‌ట్టు గుర్తించిన రెస్క్యూ అధికారులు మృతదేహాన్ని ఇటాలియన్ పట్టణంలోని కారిసోలోకు తరలించారు.   ఆడి నుంచి భారత మార్కెట్లోకి క్యూ8 ఫేస్‌లిఫ్ట్ కారు, ధర రూ.1.17 కోట్లు పై మాటే, కేవలం 5.6 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగం దీని సొంతం

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif