Cobra Hiding Inside Shoe: వీడియో ఇదిగో, షూలోకి దూరిన నాగుపాము, బుసలు కొడుతూ పైకి వచ్చిన కింగ్ కోబ్రా, బూట్లు వేసుకునే సమయంలో జాగ్రత్త మరి..
ఈ వైరల్ వీడియోలో ఓ మహిళ తన ఇంటి ముందు షూను వదిలేసింది. ఇక అందరి కళ్లుగప్పి.. షూలోకి దూరింది నాగుపాము.
కింగ్ కోబ్రా పిల్ల ఓ షూలోకి దూరిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుశాంత నంద ఎక్స్‌లో షేర్ చేశారు. ఈ వైరల్ వీడియోలో ఓ మహిళ తన ఇంటి ముందు షూను వదిలేసింది. ఇక అందరి కళ్లుగప్పి.. షూలోకి దూరింది నాగుపాము. ఆమహిళ షూ వేసుకునేందుకు యత్నించగా, బుసలు కొడుతున్న శబ్దం వినిపించింది. షూను కదిలించగా, పడగ విప్పి బయటకు వచ్చింది కింగ్ కోబ్రా. దీంతో ఆమె హడలిపోయింది. దూరంగా పరుగెత్తింది. కాసేపటికే నాగుపాము అటు నుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)