Google Doodle Pani Puri: పానీ పూరీ వేడుకలు, గూగుల్ డూడుల్‌లో దుమ్ము రేపుతున్న ఇండియన్ స్ట్రీట్ పుడ్, ప్రపంచ రికార్డు నెలకొల్పి ఇప్పటికీ 8 ఏళ్లు

దక్షిణాసియాలో అత్యంత ప్రాచుర్యం పొందిన స్ట్రీట్ పుడ్ పానీ పూరీ. దీన్ని గప్ చుప్, గోల్ గప్పా అని కూడి పిలుస్తారు. ఏ కాలంలో అయినా పానీపూరీకి ప్రజాదరణ ఏ మాత్రం తగ్గదు.పానీపూరిపై ప్రపంచ రికార్డు నెలకొల్పి 8 ఏళ్లు అవుతున్న సందర్భంగా ప్రముఖ సెర్జ్‌ ఇంజిన్‌ గూగుల్‌ ప్రత్యేక డూడుల్‌ను రూపొందించింది.

Google Pani Puri Doodle (PIC@ Google)

దక్షిణాసియాలో అత్యంత ప్రాచుర్యం పొందిన స్ట్రీట్ పుడ్ పానీ పూరీ. దీన్ని గప్ చుప్, గోల్ గప్పా అని కూడి పిలుస్తారు. ఏ కాలంలో అయినా పానీపూరీకి ప్రజాదరణ ఏ మాత్రం తగ్గదు.పానీపూరిపై ప్రపంచ రికార్డు నెలకొల్పి 8 ఏళ్లు అవుతున్న సందర్భంగా ప్రముఖ సెర్జ్‌ ఇంజిన్‌ గూగుల్‌ ప్రత్యేక డూడుల్‌ను రూపొందించింది. దీంతో పాటు పానీపూరీ ఆకృతులతో ఓ ఇంటరాక్టివ్‌ గేమ్‌ను తీసుకొచ్చింది. నెటిజన్లను ఈ గేమ్‌ తెగ ఆకట్టుకుంటోంది.

2015 జులై 12న మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌లో ఒక రెస్టారెంట్‌ 51 రకాల రుచికరమైన పానీపూరీలను అందించి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. దీంతో ఇప్పుడు గూగుల్‌ 8 ఏళ్ల తర్వాత ఈ రికార్డును గుర్తుచేస్తూ పానీపూరీ డూడుల్‌ను తీసుకువచ్చింది. వివిధ భిన్న సంస్కృతులు, ప్రాంతీయ వైవిధ్యాలు ఉన్న మనదేశంలో దీనిని రకరకాల పేర్లతో పిలుస్తారన్న విషయం తెలిసిందే.

Google Pani Puri Doodle (PIC@ Google)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now