Hardoi Shocker: దారుణం, అన్నకు రాఖీ కట్టేందుకు వెళ్తానని చెప్పిన భార్య ముక్కు కోసేసిన భర్త, వీడియో ఇదిగో..
ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాలో సోదరుడికి రాఖీ కట్టేందుకు పుట్టింటికి వెళ్తానిని భార్య పట్టుబట్టడంతో ఆగ్రహించిన భర్త (Husband Cuts Wife’s Nose) ఆమె ముక్కు కోశాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాలో సోదరుడికి రాఖీ కట్టేందుకు పుట్టింటికి వెళ్తానిని భార్య పట్టుబట్టడంతో ఆగ్రహించిన భర్త (Husband Cuts Wife’s Nose) ఆమె ముక్కు కోశాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బనియాని పూర్వాలో నివసిస్తున్న రాహుల్, 25 ఏళ్ల అనిత భార్యాభర్తలు. వారిద్దరి మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో పుట్టింటికి వెళ్లిన అనిత నాలుగు రోజుల కిందట భర్త ఇంటికి వచ్చింది. అయితే సోదరుడికి రాఖీ కట్టేందుకు తన పుట్టింటికి వెళ్తానని భర్త రాహుల్‌కు ఆదివారం చెప్పింది. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన అతడు అనిత ముక్కు కోశాడు. వీడియో ఇదిగో, విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ గుండెపోటుతో కుప్పకూలిన కాంగ్రెస్ నేత, సీకే రవిచంద్రన్ మృతిపై సంతాపం తెలిపిన సీఎం సిద్ధరామయ్య
మహిళ కేకలు విన్న ఆమె బావ వెంటనే అక్కడకు చేరుకున్నాడు. ముక్కు తెగడంతో రక్తపు మడుగులో పడి ఉన్న అనితను హర్దోయ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో అడ్మిట్ చేశాడు. మెరుగైన చికిత్స కోసం లక్నోలోని ట్రామా సెంటర్‌కు డాక్టర్లు రిఫర్ చేయడంతో ఆమెను అక్కడకు తరలించారు.ఘటన తర్వాత తన భర్తపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మహిళ మాట్లాడిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)