Electricity Bill Socker: కరెంటు బిల్లు విలువ రూ.4,950.. రూ.197 కోట్లు చెల్లించినట్టు కస్టమర్ కు రసీదు..!.. ఏంటా సంగతి??
మనం ఎంత మొత్తమైతే బిల్లు చెల్లిస్తామో అంతే మొత్తానికి రసీదు ఇస్తారు.
Newdelhi, Dec 2: కరెంటు బిల్లు (Electricity Bill) చెల్లించినప్పుడు విద్యుత్ బిల్లు వసూలు చేసే ఉద్యోగి రశీదు ఇవ్వడం సాధారణమే. మనం ఎంత మొత్తమైతే బిల్లు (Bill) చెల్లిస్తామో అంతే మొత్తానికి రసీదు ఇస్తారు. కానీ ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని గోరఖ్ పూర్ కు చెందిన చౌహారీ దేవి అనే ఓ మహిళా కస్టమర్ కు అందుకు భిన్నంగా బిల్లు వచ్చింది. ఆమె కుమారుడు రూ.4,950 బిల్లు చెల్లిస్తే.. బిల్లు తీసుకున్న ఉద్యోగి రసీదు మాత్రం రూ.197 కోట్లకు ఇచ్చాడు. వసూలైన నగదుకు, బిల్లులో ఉన్న మొత్తానికి కోట్లలో తేడా వచ్చినట్టు గుర్తించిన అధికారులు.. చౌహారీ దేవి అనే కస్టమర్‌కు రూ.197 కోట్లకు రసీదు ఇచ్చినట్లు గుర్తించారు. దాంతో ఆ బిల్లును డిలీట్ చేసి, రూ.4,950కి కొత్త రసీదును జనరేట్ చేసి ఆమెకు పంపించారు చౌహారి దేవి బిల్లు చెల్లించిన సమయంలో బిల్లు మొత్తాన్ని ఎంటర్ చేయాల్సిన దగ్గర బిల్లుకు బదులుగా ఆమె విద్యుత్ కనెక్షన్ నెంబర్ (197000)ను ఎంటర్‌చేశారు. ఆ నెంబర్ మొత్తం రూ.197 కోట్లకుపైన ఉన్నది. అందుకే లెక్కల్లో రూ.197 కోట్ల తేడా వచ్చింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)