Hyderabadi Biryani: బెస్ట్ ఇండియన్ ఫుడ్ లిస్టు, ఆరవస్థానంలో హైదరాబాదీ బిర్యానీ, అగ్రస్థానంలో మ్యాంగో లస్సీ, చెత్త రేటెడ్ ఇండియన్ ఫుడ్స్ లిస్టు ఏంటో తెలుసా..

ఈ సంస్థ విడుదల చేసిన ఉత్తమ రేటింగ్ పొందిన భారతీయ వంటకాల” జాబితాలో హైదరాబాదీ బిర్యానీ ఏడాది తర్వాత మళ్లీ 6వ స్థానాన్ని దక్కించుకుంది. ఈ జాబితాలో మ్యాంగో లస్సీ అగ్రస్థానంలో ఉంది

Hyderabadi Biryani: (photo-Pixabay)

టేస్ట్ అట్లాస్ అనే సంస్థ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ది చెందిన వంటకాల జాబితాను విడుదల చేసింది. ఈ సంస్థ విడుదల చేసిన ఉత్తమ రేటింగ్ పొందిన భారతీయ వంటకాల” జాబితాలో హైదరాబాదీ బిర్యానీ ఏడాది తర్వాత మళ్లీ 6వ స్థానాన్ని దక్కించుకుంది. ఈ జాబితాలో మ్యాంగో లస్సీ అగ్రస్థానంలో ఉంది. సిద్ధి చెందిన ఫుడ్ లిస్టు లో మసాలా టీ సెకండ్ ప్లేస్ లో ఉంది. ఇక బటర్ గార్లిక్ నాన్ 3వ స్థానంలో ఉంది. 4వ ప్లేస్ లో అమృతసరి కుల్చా, బటర్ చికెన్ 5వ, షాహీ పనీర్ 7వ, చోలే భతురే 8వ, తందూరి చికెన్ 9వ ప్లేస్ లో ఉండగా 10వ స్థానాన్ని కుర్మా దక్కించుకుంది.  బిర్యానీ బోలే తో హైదరాబాద్. నగరంలో ఎప్పుడు దొరికే దమ్ బిర్యానీతో పాటు చాలా రకాల బిర్యానీలు ఉన్నాయని మీకు తెలుసా?

భారతీయ ఆహారంలో చెత్త రేటింగ్ ను పొందిన వంటకాల్లో జాబితాలో మొదటి ప్లేస్ లో జీరా వాటర్ ఉంది. ఈ జీరా వాటర్ ను వేసవి కాలంలో ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం తీసుకుంటారు.‘కొబ్బరి అన్నం’ 3వ స్థానంలో, పంతా భట్ 4వ స్థానంలో, బంగాళదుంప వంకాయ కూర 5వ స్థానంలో, తండై 6వ స్థానంలో అచ్చప్పం అంటే గులాబీ పువ్వులు 7వ స్థానంలో, బిర్యానికి రుచిని అందించే మిర్చి కా సలాన్ 8వ స్థానంలో, మల్పువా 9వ స్థానంలో, ఉప్మా 10వ స్థానంలో నిలిచాయని ఒక జాబితాను టేస్ట్ అట్లాస్ రిలీజ్ చేసింది. ఈ రేటింగ్ పై భారతీయ వంట ప్రియులు మండిపడుతున్నారు.

Here's News

 

View this post on Instagram

 

A post shared by The Times of India (@timesofindia)