Ayodhya Ram Mandir: వీడియో ఇదిగో, రామలక్ష్మణులు సీత వేషాల్లో ఇండిగో సిబ్బంది, విమానం అయోధ్య వెళుతోందని బోర్డింగ్ అనౌన్స్ మెంట్

వీరిని ప్రయాణికులు ఆసక్తిగా తిలకించారు. ఇండిగో సిబ్బంది రామ, లక్ష్మణ, సీత వేషాల్లో ఉంటూనే బోర్డింగ్ అనౌన్స్ మెంట్, ప్రయాణికులకు ఆహ్వానం పలకడం వంటి విధులు నిర్వర్తించారు

Indigo staff dressed as Shri Ram, Sita, Laxman

అయోధ్యలో నిర్మితమవుతున్న రామ మందిరంలో ఈ నెల 22న ప్రాణ ప్రతిష్ట జరగనుంది. ఈ నేపథ్యంలో, ప్రముఖ విమానయాన సంస్థలు దేశంలోని వివిధ నగరాల నుంచి అయోధ్యకు నేరుగా విమానాలు నడుపుతున్నాయి. ఈ క్రమంలో ఇండిగో విమాన సంస్థ కూడా గుజరాత్ లోని అహ్మదాబాద్ నుంచి అయోధ్యకు ఓ సర్వీసును నడుపుతోంది. ఆ విమాన సర్వీసు నిన్న ప్రారంభం అయింది.

ఈ నేపథ్యంలో, ఇండిగో సిబ్బంది రామ, లక్ష్మణ, సీత, హనుమంతుడి వేషధారణలో కనువిందు చేశారు. వీరిని ప్రయాణికులు ఆసక్తిగా తిలకించారు. ఇండిగో సిబ్బంది రామ, లక్ష్మణ, సీత వేషాల్లో ఉంటూనే బోర్డింగ్ అనౌన్స్ మెంట్, ప్రయాణికులకు ఆహ్వానం పలకడం వంటి విధులు నిర్వర్తించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)