Is Rohit Sharma Retiring? అడ్వర్టయిజ్‌మెంట్ స్టాండ్స్ వైపు గ్లౌవ్స్ విసిరేసిన రోహిత్ శర్మ, రిటైర్మెంట్‌పై హింట్ ఇచ్చేశాడని కామెంట్లు పెడుతున్న నెటిజన్లు
అటు టెస్టుల్లో జట్టు ఓటమి, ఇటు తన బ్యాటింగ్ వైఫల్యంతో పరిస్థితులు మరింత దిగజారిపోతున్నాయి. ఈ తరుణంలో ఆస్ట్రేలియాతో టెస్ట్ మ్యాచ్ లో మళ్లీ ఫెయిల్ అవడంతో ఫ్రస్ట్రేషన్‌లో గ్లౌవ్స్ విసిరేశాడు.
వరుస ఫెయిల్యూర్స్‌తో సతమతమవుతున్న రోహిత్ శర్మ సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్నాడు. అటు టెస్టుల్లో జట్టు ఓటమి, ఇటు తన బ్యాటింగ్ వైఫల్యంతో పరిస్థితులు మరింత దిగజారిపోతున్నాయి. ఈ తరుణంలో ఆస్ట్రేలియాతో టెస్ట్ మ్యాచ్ లో మళ్లీ ఫెయిల్ అవడంతో ఫ్రస్ట్రేషన్‌లో గ్లౌవ్స్ విసిరేశాడు. గబ్బాలో మూడో టెస్టులో భారత ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 27 బంతుల్లో కేవలం 10 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. కమిన్స్ బౌలింగ్‌లో కీపర్ అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. అయితే పెవిలియన్ దిశగా వెళ్తూ వెళ్తూ తన గ్లౌవ్స్‌ను అతడు విసిరిపారేశాడు. అడ్వర్టయిజ్‌మెంట్ స్టాండ్స్ వైపు గ్లౌవ్స్‌ను విసిరి సీరియస్‌గా డగౌట్‌కు వెళ్లిపోయాడు రోహిత్.
డ్రాగా ముగిసిన మూడో టెస్టు, భారత్ ముందు 275 టార్గెట్...వర్షంతో మ్యాచ్‌ను రద్దు చేసిన అంపైర్లు
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫొటోలు చూసిన నెటిజన్స్.. అతడు రిటైర్మెంట్ మీద హింట్ ఇచ్చాడని అంటున్నారు.టీ20 వరల్డ్ కప్-2024తో పొట్టి ఫార్మాట్‌కు రోహిత్ గుడ్‌బై చెప్పేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025 తర్వాత 50 ఓవర్ల క్రికెట్ నుంచీ సెలవు తీసుకుంటాడనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ తరుణంలో రోహిత్ గ్లౌవ్స్ విసిరేయడంతో అనూహ్యంగా టెస్ట్ రిటైర్మెంట్ మీదా రూమర్స్ మొదలయ్యాయి.
Is Rohit Sharma retiring?,’Gloves Act’ At The Gabba Triggers Retirement Speculations
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)