Viral Video: కుక్కలా మారేందుకు రూ. 12 లక్షల ఖర్చుపెట్టిన యువకుడు, యూట్యూబ్ ఛానల్లో ఆ వీడియో అప్‌లోడ్ చేస్తే లక్షల్లో వ్యూస్
జపాన్ కు చెందిన ఓ వ్యక్తి కుక్కలా మారేందుకు రూ. 12 లక్షలు ఖర్చు చేశాడు. వైరల్ న్యూస్ వివరాల్లోకెళితే..జపాన్‌కు చెందిన టోకో అనే వ్యక్తి ఓ యూ ట్యూబర్.ఐ వాంట్ టు బీ యాన్ యానిమల్’ (జంతువులా మారాలనుకుంటున్నా) అనే ఛాన్ నడుపుతున్నాడు. 31 వేల మందికి పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.
Japanese Man Spent $14,000 To Transform Into Dog: జపాన్ కు చెందిన ఓ వ్యక్తి కుక్కలా మారేందుకు రూ. 12 లక్షలు ఖర్చు చేశాడు. వైరల్ న్యూస్ వివరాల్లోకెళితే..జపాన్‌కు చెందిన టోకో అనే వ్యక్తి ఓ యూ ట్యూబర్.ఐ వాంట్ టు బీ యాన్ యానిమల్’ (జంతువులా మారాలనుకుంటున్నా) అనే ఛాన్ నడుపుతున్నాడు. 41 వేల మందికి పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.
మనోడు జంతు ప్రేమికుడు కావడంతో కుక్కలా మారాలనుకుని..జపాన్‌లో సినిమాలకు, టీవీ షోలకు కాస్ట్యూమ్స్ సరఫరా చేసే జెప్పెట్ అనే ప్రముఖ స్థానిక కంపెనీని సంప్రదించాడు. వాళ్లు అతనికి కోరికకు ఒకే చెప్పగా 14 వేల డాలర్లు అవుతుందని చెప్పారు. మనోడు ఒకే అనడం వారు కుక్క బొచ్చును తయారు చేయడం జరిగిపోయాయి. ఆ కుక్క బొచ్చును తయారు చేసేందుకు మేకర్లకు 40 రోజుల టైం పట్టింది.
అంతా రెడీ అయ్యాక మనోడు తొలిసారిగా సమీపంలోని పార్కుకు షికారుకు బయల్దేరాడు. అక్కడ అచ్చం కుక్కలా దొర్లుతూ, తోటి కుక్కల దగ్గరికెళ్లి వాటిని వాసన చూస్తూ హడావుడి చేశాడు. దీన్నంతటినీ వీడియో తీయించుకోవడం మర్చిపోలేదు. దాన్ని తన యూట్యూబ్ చానళ్లో అప్‌లోడ్ చేస్తే చూస్తుండగానే 10 లక్షలకు పైగా వ్యూస్ వచ్చి పడ్డాయి. ఆ వీడియో ఇదిగో..
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)