Kolkata Rape-Murder Case: రండి 20 రూపాయలు ఇచ్చినా మీతో పడుకుంటాం, ఈ దారుణాలెందుకు, కామాంధులకు సూటి ప్రశ్నలు సంధించిన సెక్స్ వర్కర్, వీడియో ఇదిగో
రెడ్ లైట్ ఏరియాలు లేకుండా మహిళలు బతకగలిగినప్పుడు.. పురుషులు ఎందుకు ఆ పనిచేయలేరు.. అని ప్రశ్నించి సామాజిక రుగ్మతలను సవాలు చేసింది.
కోల్‌కతాలోని ఆర్‌జీకర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ఈ నెల 9న ట్రైనీ డాక్టర్‌పై జరిగిన లైంగిక దాడి, హత్య కేసు ఘటన యావత్ దేశాన్ని కలవరపెట్టింది. విధుల్లో అలసిపోయి ఆసుపత్రి సెమినార్ హాల్లో నిద్రపోతున్న ఆమెపై కామాంధుడు దాడి చేశాడు. 31 ఏళ్ల బాధితురాలిని చెప్పలేని, రాయలేని విధంగా అత్యాచారానికి తెగబడి, టార్చర్ చేసి మరీ హత్య చేశాడు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఇంకా నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. కోల్‌కతా వైద్యురాలిపై హత్యాచారం కేసులో కామాంధులైన నెటిజన్లు, గూగుల్ సెర్చ్‌లో దారుణమైన పదాలతో వెతుకులాట
హత్యాచార ఘటన తర్వాత కోల్‌కతా రెడ్ లైట్ ఏరియా అయిన సోనాగచ్చికి చెందిన ఓ సెక్స్ వర్కర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ మీడియా ప్రతినిధితో ఆమె మాట్లాడుతూ ‘‘మీ కోరికను తృప్తిపరుచుకోవాలంటే సోనాగచ్చి రండి. ఇలా చదువుకున్న అమ్మాయిలు, పనిచేసుకుంటున్న మహిళలపై దారుణాలకు పాల్పడాల్సిన అవసరం ఏముంది? 20, 30 రూపాయలు ఇచ్చినా పనిచేసేందుకు మేం సిద్ధంగా ఉన్నప్పుడు వాళ్ల వెంటపడి ఉసురు తీస్తారు ఎందుకు?’’ అని ప్రశ్నించింది. పురుషులకు రెడ్‌లైట్ ఏరియాలు ఎందుకు అవసరమన్న మరో ప్రశ్నకు ఆమె బదులిస్తూ.. రెడ్ లైట్ ఏరియాలు లేకుండా మహిళలు బతకగలిగినప్పుడు.. పురుషులు ఎందుకు ఆ పనిచేయలేరు.. అని ప్రశ్నించి సామాజిక రుగ్మతలను సవాలు చేసింది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)